మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్లేస్ క్రియేట్ చేసుకుంటున్న హీరో సాయి ధరమ్ తేజ్. ఆమధ్య వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డ సాయి తేజ్ గత ఏడాది వచ్చిన చిత్రలహరి సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ పట్టాడు. అదే ఉత్సాహంతో చేసిన ప్రతిరోజూ పండగే సినిమాతో మరో హిట్ కొట్టి గాడిలో పడ్డాడు ఈ మెగా హీరో. ప్రస్తుతం ఈ యువ హీరో చేస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’.

IHG

 

ఇటివల విడులైన ఈ పాటకు మంచి ఆదరణ వస్తోంది. ఈ పాట వీడియో వీక్షకుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ‘నో పెళ్లి’ అంటూ యూట్యూబ్ లో తెగ సందడి చేస్తున్నాడు. మెగా అభిమానుల అండదండలు పుష్కలంగా ఉన్న ఈ మెగా హీరోకు వారంతా ఎంత అండగా ఉంటారో నిరూపించారు. ఈ పాట రిలీజ్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మెగా, సాయి ధరమ్ తేజ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ పాటను తమ నగరాల్లో విడుదల చేస్తూ ఉన్న ఫొటోలు షేర్ చేశారు. ఈ ఫొటోలను సినిమాను నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

IHG

 

సాయి ధరమ్ తేజ్ సినిమా హిట్టవ్వాలంటూ ఏలూరులో ఆంజనేయస్వామి గుళ్లో పూజ కూడా నిర్వహించడం విశేషం. షూటింగ్ పూర్తైన ఈ సినిమా లాక్ డౌన్ వల్ల విడుదల కావడం వాయిదా పడింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా సుబ్బు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మంచి జోరు మీదున్న సంగీత సంచలనం థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ లో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: