తెలుగమ్మాయి కాకపోయినా.. హైదరాబాదీ అని చెప్పుకుంటుంది. తెలుగు సినిమాలతో కాస్త డబ్బులు సంపాదించి ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేసింది. తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇంతగా టాలీవుడ్ తో మమేకం అయినా.. ఇక్కడ ఛాన్సులు మాత్రం నిల్. ఎన్నో ఆశలు పెట్టుకొని ఫౌడౌట్ ముద్ర వేసుకుంది. 

 

గ్లామర్ తో టాలీవుడ్ ను బొక్కబోర్లా పడేసి.. స్టార్స్ అందరనీ తనవైపు తిప్పుకుంది రకుల్. కెరీర్ లో ఒకటి రెండు హిట్స్ కొట్టి.. అరడజను ఛాన్సులు వెనుకేసుకొని లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఆ అధృష్టం ఇప్పుడు మొహం చాటేయడంతో అసలుకే ఎసరొచ్చింది. కళకళలాడిన కెరీర్ కాస్తా మసకబారింది. 

 

ఒకటా రెండా.. వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు. తెలుగు, తమిళంలో ఏ సినిమా చేసినా నిరాశే. రారండోయ్ వేడుక చూద్దాం తర్వాత ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ దక్కలేదు. ముఖ్యంగా మన్మథుడు2లో ఈ అమ్మడు పోషించిన క్యారెక్టర్ విమర్శలు తీసుకొచ్చింది. స్మోక్ చేసి.. కెరీర్ కు పొగపెట్టుకుంది రకుల్.  

 

కంటిన్యూస్ ఫ్లాపులు.. ఆఫర్స్ లేకపోయినా.. ఎప్పుడూ జనాలకు టచ్ లోనే ఉంది రకుల్. చేతిలో సినిమాల్లేక కావాల్సినంత ఖాళీ దొరికింది. గ్లామర్ గా ఫోజులివ్వడం.. లేదంటే ఫిట్ నెస్ చాటున ఒయ్యారాలు ఒలకబోస్తూ.. కవ్వించాలని చూసినా.. తెలుగు హీరోల్లో ఒక్కరూ కనికరించి ఛాన్స్ ఇవ్వలేదు. 

 

తెలుగులో ఆఫర్స్ లేకపోయినా.. బాలీవుడ్ రకుల్ ను ఓదార్చి రెండు, మూడు ఆఫర్స్ ఇచ్చింది. తమిళంలో భారతీయుడు 2తో పాటు మరో సినిమా చేస్తున్నా.. తెలుగులో మాత్రం ఫౌడౌట్ హీరోయిన్ అనే ముద్ర నుంచి ఎప్పుడు బయటపడుతుందో చూడాలి. 

 

మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్ అవకాశాల కోసం నానా పాట్లు పడుతోంది. తెలుగమ్మాయి కాకపోయినా.. హైదరాబాదీ అని చెప్పుకోవడమే ఇందుకు నిదర్శనం. పైగా తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటాననడం కూడా ఒక ప్లానే. ఇలా టాలీవుడ్ పై ఎంతో నమ్మకం పెట్టుకున్న ఈ  బ్యూటీకి ఛాన్స్ లు రాకపోవడం ఆమెను నిరాశపరుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: