ఎంత పెద్ద హీరో అయినా సీన్ జోన్ కే ప్రియారిటీ ఇస్తాడు. ఫ్యాన్స్ ను మెప్పించే సినిమాల్లో నటిస్తుంటాడు. నాని కూడా ఇన్నాళ్లూ అభిమానులను అలరించే కథలకే ఓటేశాడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చుతున్నాడు మజ్ఞు. నేచురల్ స్టార్ నుంచి వేరియేషన్ స్టార్ గా మారేందుకు కొత్తకొత్త యాసలు నేర్చుకుంటున్నాడు. 

 

నానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. బీసీ సెంటర్స్ కంటే మల్టీప్లెక్స్ ల్లో ఈ హీరోకు కలెక్షన్లు భారీగా ఉంటాయి. అందుకే నాని కూడా వీళ్లను ఇంప్రెస్ చేయడమే మెయిన్ టార్గెట్ గా పెట్టుకుంటున్నాడు. అయితే ఇప్పుడీ ఫార్మాట్ లోనే కొంచెం డిఫరెన్స్ చూపించాలనుకుంటున్నాడు నేచురల్ స్టార్. వేరియేషన్స్ తో ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు నాని. 

 

సినిమా సినిమాకు నాని ఓ కొత్త యాంగిల్ చూపించాలనుకున్నాడు. ఇప్పటికే వి సినిమాలో కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశాడు నాని. ఇంద్రగంటి మోహన క్రిష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లాక్ డౌన్ తర్వాత రిలీజ్ కాబోతోంది. 

 

నాని తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమాకు కమిట్ అయ్యాడు. టైటిల్ తోనే ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీలో నాని గోదారి కుర్రాడిగా కనిపించబోతున్నాడు. ఇక క్యారెక్టర్ కు తగ్గట్టుగా నాని గోదారి యాసలో మాట్లాడతాడని తెలుస్తోంది. 

 

నాని ఈ లాక్ డౌన్ లో ఓ కొత్త దర్శకుడితో సినిమాకు సైన్ చేశాడు. సుకుమార్ అసోసియేట్ శ్రీకాంత్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ కథ తెలంగాణ రూరల్ స్టోరీగా తెరకెక్కుతోందని సమాచారం. 

 

స్టోరీకి తగ్గట్టుగా నాని నైజం యాసతో సందడి చేస్తాడని చెబుతున్నారు. ఇక ఇంతకుముందు నాని కృష్ణార్జున యుద్ధం సినిమాలో రాయలసీమ కుర్రాడిగా నటించాడు. సీమ స్లాంగ్ లో డైలాగులు పేల్చాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: