మనిషికి ఎన్ని లక్షల కోట్లు ఉన్నా, అవన్ని మంచి మనసు ముందు చిన్ననే.. ఎందుకంటే ప్రపంచాన్ని కరోనా తాకి చాల మంచి పనే చేసింది.. మనుషులు మాటలు చెప్పడంలో, మాయ చేయడంలో ముందుంటారు కానీ ఆప్తులను, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో మాత్రం తమ స్వార్ధాన్ని చూపిస్తారని నిరూపించింది.. దాదాపు లోకాన్ని నిశితంగా పరిశీలిస్తే.. కోట్ల కొద్ది ఆస్తులు ఉన్న వారు కూడా కరోనా కష్టకాలంలో చిన్న సహయం చేయడానికి వెనకా ముందు ఆలోచిస్తున్నారు.. ఇక మరి కొందరు తాము చేసిన సహాయానికి తమ ఆస్తులు ఏవో ఉచితంగా రాసిచ్చినట్లుగా ఫీలవుతు పబ్లిసిటి కోసం ప్రాకులాడుతున్నారు..

 

 

ఇదంత పక్కనపెడితే.. సినిమా రంగానికి చెందిన ఎవరన్నా ప్రజలకు విపరీతమైన అభిమానం.. కొందరికైతే పిచ్చి ప్రేమ కానీ కరోనా సమయంలో చేతిలో నుండి చిల్లిగవ్వ కూడా విదల్చని వారున్నారు.. ఈ కోవలోకి హీరోయిన్స్, హీరోలు, కమెడియన్‌గా సంపాదించుకున్న వారు కూడా ఒక్క రూపాయి అయినా కరోనా బాధితులకు గానీ, పేదలకు గానీ సహయం చేసినట్లుగా కనబడలేదు.. కొందరు మాత్రమే ముందుకు వచ్చారు.. ఇదే కాకుండా బుల్లితెర కమెడియన్స్‌గా జీవితంలో స్దిరపడ్దవారు కూడా కరోనా సమయంలో పెదవి విప్పలేదు.. ఏమైనా అంటే ఇంటర్వూల్లో మేము చాలా కష్టపడి పైకి వచ్చాం అని సొల్లు చెబుతారు.. నిజంగా కష్టపడ్ద వారికి కష్టం విలువ చెప్పవలసిన అవసరం లేదు..

 

 

ఇకపోతే దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారీ విరాళం ప్రకటించి మంచి మనసు చాటుకున్న విషయం తెలిసిందే... అదేమంటే కరోనాపై పోరాటంలో ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఇది గాక ఇప్పటికే పీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 25 కోట్లు విరాళం అందజేశారు. తాజాగా సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(సింటా)కు రూ. 45 లక్షల విరాళాన్ని అందించారు. దీని ద్వారా 1500 మందికి ఒక్కొక్కరికీ రూ. 3 వేల చొప్పున ఆర్ధిక సాయం అందనున్న‌ట్టు తెలుస్తోంది.

 

 

ఇక తెరమీదనే హీరో కాదు నిజజీవితంలో కూడా రియల్ హీరో అక్షయ్ కుమార్.. అందుకే అక్ష‌య్ ఉదార స్వ‌భావానికి అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే టాలీవుడ్ కంటే బాలీవుడ్ నటులు పేదలకు సహయం చేయడంలో చాలా ముందుంటామని దాదాపుగా అందరు నిరూపించారు.. ఇప్పటికైన అభిమానులు నిజమైన హీరోలను గుర్తించి, అభిమానిస్తే చాలని కొందరు అంటున్నారు.. మానవ సేవయే మాధవ సేవ.. ఇది అందరికి అబ్బదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: