టాలీవుడ్ లో ఎక్కువగా వైవిధ్యభరితమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది విక్టరీ వెంకటేష్. ముఖ్యంగా వెంకటేష్ కి రీమేక్ కింగ్ అన్న పేరు కూడా ఉంది. కథ నచ్చితే అది ఏ భాషలో సూపర్ హిట్ అయినా మళ్ళీ తెలుగులో రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అంతేకాదు అలా చేసిన చాలా సినిమాలతో సూపర్ హిట్స్ ని అందుకున్నాడు వెంకటేష్. రాజా, చంటి, సంక్రాంతి, వసంతం ..ఇలా చాలా సినిమాలు వెంకటేష్ చేసిన రీమేక్ సినిమాల లిస్ట్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా మరోసారి ప్రేక్షకుల్ని అలాంటి సినిమాతోనే పలకరించబోతున్నారు.

 

తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా ‘అసురన్’. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. అంతేకాదు ధనుష్ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియోట్ చేసింది. 100 కోట్లు వసూళ్ళు చేసి తమిళ మేకర్స్ ని అబ్బురపరచింది. ఇక ఈ కథ ని తెలుగులో ‘నారప్ప’గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ‘ఎఫ్ 2’, ‘వెంకీమామ’ వరుస హిట్లతో జోరు మీద ఉన్న విక్టరీ వెంకటేష్ హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు అసురన్ ని ఎంచుకున్నారు.

 

ఇప్పటికే విడుదలైన ‘నారప్ప’ పోస్టర్స్‌లో వెంకటేష్ లుక్ కి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఊర మాస్ గెటప్‌లో వెంకటేష్ పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ హిట్ గ్యారెంటీ అన్న ధీమాని కలిగించాడు.  కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ‘బ్రహ్మోత్సవం’ సినిమాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ రీమేక్‌కి డైరెక్ట్ చేస్తున్నాడు.

 

ఇక ఈ సినిమాలో వెంక‌టేశ్ స‌ర‌స‌న ప్రియ‌మ‌ణి నటిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్‌లో సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొంత టాకీపార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలవనుంది. అయితే ఈ మధ్య వెంక‌టేశ్ రానా కలిసి సినిమా చేయబోతున్నారంటు అలాగే వెంక‌టేశ్ నాని ల కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా రాబోతుందన్న వార్తలు వచ్చాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వెంక‌టేశ్ నారప్ప కంప్లీటయ్యాకే తన నెక్స్ట్ సినిమా ఉండబోతుందట. ఇప్పటి వరకు వచ్చినవన్ని రూమర్సే అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: