యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని డి వి వి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరో హీరో గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో శక్తివంతమైన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాతో ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ పాన్ ఇండియా స్టార్స్ గా క్రేజ్ సాధించడం ఖాయమని ఇప్పటికే చెప్పుకుంటున్నారు. 

 

ఇక ఈ సినిమా కంప్లీటవగానే ఎన్టీఆర్ మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కి 30 వ సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ (చినబాబు) - నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించినప్పటి నుంచి టైటిల్ విషయంలో తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. ఎలాంటి పవర్ ఫుల్ టైటిల్ పెడతారు త్రివిక్రమ్ అని. అయితే ఇప్పటికే 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ఫైనలైజ్ చేశారని చాలా రోజులుగా సోషల్ మీడియాలో ఈ టైటిల్ బాగా వైరల్ అయింది. కాని తాజా సమాచారం ప్రకారం అసలు టైటిల్ ఇది కాదని తెలుస్తుంది. 

 

త్రివిక్రమ్ శ్రీనివాస్ కి 'అ' సెంటిమెంటు కంటిన్యూ చేస్తు వస్తుండటంతో  త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాకి 'అయినను పోయి రావలె హస్తినకు' అన్న టైటిల్ పెడుతున్నారంటూ రూమర్ వచ్చిందని చెప్పుకుంటున్నారు. త్రివిక్రమ్ గత సినిమాలు 'అతడు' 'అ ఆ' 'అజ్ఞాతవాసి' 'అల వైకుంఠపురంలో' 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రాల టైటిల్స్ సెంటిమెంట్ గా 'అ' అక్షరం పెట్టి  సక్సస్ లు అందుకున్నారు. 

 

అదే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ తారక్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాకి 'అయినను పోయి రావలె హస్తినకు' అనుకుంటున్నారని త్వరలో అధికారకంగా ఈ టైటిల్ ప్రకటిస్తారని అన్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ను కంప్లీట్ చేసే పనిలో తలమునకలై ఉన్నాడు త్రివిక్రమ్. అంతేగాని ఇంకా ఈ సినిమా టైటిల్ గురించి గాని హీరోయిన్స్ గురించి గాని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని తెలుస్తుంది. కంప్లీట్ గా స్రిప్ట్ పూర్తయ్యాకే ఈ సినిమా టైటిల్ అండ్ కాస్ట్ క్రూ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: