'సర్కార్ వారి పాట' ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట ..దీని గురించే పెద్ద చర్చ జరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 'సర్కార్ వారి పాట' అన్న దాని గురించే రక రకాల వార్తలు. అసలు ఇది  ఏంటి అన్న విషయం కూడా ఆలోచించనవసరంలేదు. 'సర్కార్ వారి పాట'.. సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కి అనుకుంటున్న టైటిలే 'సర్కార్ వారి పాట'.

 

వాస్తవంగా అయితే ఈ ప్రాజెక్ట్ గురించి మహేష్ కానీ చిత్ర నిర్మాతలు కానీ, దర్శకుడు గాని ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు. కాని మహేష్ బాబు - డైరెక్టర్ పరశురామ్ కాంబోలో ప్రాజెక్ట్ ఉండబోతోందనే వార్తలపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. మహేష్ బాబు కెరీర్లో 27వ సినిమాగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందబోయో ఈ సినిమా అధికారక ప్రకటన్ కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

 

'సరిలేరు నీకెవ్వరూ'  సినిమా తర్వాత మహేష్ నుంచి వచ్చే సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందో అన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. ఇక మహేష్ తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ నెల 31న ఈ సినిమాని అఫీషియల్ గా ప్రారంభించాలని అనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా షూటింగ్  ప్రారంభించాలని.. అదే రోజు సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేయాలని మహేష్ టీం అనుకున్నారట. ఇప్పటికే ఇందుకు సంబందించిన పోస్టర్ ని కూడా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది.

 

అయితే ఇంతలోనే సూపర్ స్టార్ టీమ్ కి ఊహించని షాక్ తగిలింది. మహేష్ 27 టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక టైటిల్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ అనుకుంటున్నారని.. ఇదే టైటిల్ ఫైనలైజ్ చేసే అవకాశం ఉందని బాగా న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఇది తెలిసిన మహేష్ టీమ్ షాక్ కి గురైయ్యారట. ఇంత జాగ్రత్తపడినా ఈ సినిమా టైటిల్ ఎలా లీక్ అయ్యిందని అవాక్కవుతున్నారట. కృష్ణ బర్త్ డే కి సర్ప్రైజ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ ఇలా లీకవడంతో సస్పెన్స్ పోయిందని ఫీలవుతున్నారట.

 

మరి మహేష్ 27 అండ్ టీమ్ 'సర్కార్ వారి పాట' టైటిల్ ఫిక్స్ చేస్తారా లేదా వేరే టైటిల్ ఆలోచిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరో వైపు టైటిల్ ఇదేనా అన్న సందేహాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, ఎంబీ ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: