తెలుగు చిత్ర పరిశ్రమలో సత్తా చాటిన దర్శకులెందరో ఉన్నారు. అయితే ఓ పద్ధతిలోనే వెళ్తున్న దర్శకత్వానికి కొత్త అర్ధం చెప్పిన దర్శకుడు మాత్రం దాసరి నారాయణరావు అనే చెప్పాలి. సినిమాను డైరక్ట్ చేయడంలో కొత్త పోకడలు తీసుకొచ్చి దర్శకుడికి ఇమేజ్ తీసుకొచ్చారు దాసరి. తాత మనవడు సినిమాతో దర్శకుడిగా వేసిన తొలి అడుగులోనే సూపర్ హిట్ కొట్టారు. అక్కడి నుంచి చేసిన ప్రతి సినిమాలో వైవిధ్యం చూపిస్తూ వచ్చారు. ఓ రకంగా డైరక్షన్ లో మార్పులు తెచ్చారు. ఎంతోమంది దర్శకులకు దిక్సూచిగా నిలిచారు.

IHG

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేయడం దగ్గర నుంచీ కొన్ని సందర్భాల్లో పాటలు కూడా రాసేవారు. ఇది ఆయనలోని సృజనకు నిదర్శనం. వీటితో పాటు అనేక సినిమాల్లో ముఖ్య పాత్రలు చేశారు. తాను మాత్రమే న్యాయం చేయగలిగిన పాత్రలు చేశారు. ఎమ్మెల్యే ఏడుకొండలు, పోలిస్ వెంకటస్వామి, లంచావతారం, సూరిగాడు, నాన్నగారు.. ఇలా ఎన్నో పాత్రల్లో నటించారు. దర్శకత్వం అంటేనే సృజనాత్మకత ఎక్కువ ఉండాలి. కానీ.. దాంతో పాటు ఇన్ని కళలు ఉండటం బహు అరుదు. దాసరి తన సినీ జీవితంలో ఇవన్నీ చాలా సులభంగా చేశారు. ఓ దశలో ఏకంగా ఎనిమిది సినిమాలు వరుసగా హిట్లు ఇచ్చి రికార్డు సృష్టించారు.

IHG

దర్శకుడిగా ఇన్ని పనులు చేస్తూనే క్రియేటర్ గా నటులను తీర్చిదిద్దారు. ఎందరో దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.  వీరితో మాత్రమే కాకుండా తెలుగు సినిమాల్లో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు దాసరి. ఇండస్ట్రీలో సమస్య ఏదైనా దాసరి పరిష్కరించాల్సిందే. ఎవరికి సమస్య వచ్చినా దాసరి దగ్గరకు పంచాయితీ వెళ్లాల్సిందే. ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా దాసరి పేరే వినిపించడానికి ఆయనలో ఉన్న దార్శనికత, ప్రతి విషయంపై అవగాహనే కారణాలయ్యాయి. అందుకే అన్నేళ్లు దాసరి తెలుగు సినీ పరిశ్రమపై ప్రభావం చూపగలిగారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: