కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ కుదేలయిన సంగతి తెలిసిందే. ఊహించని మహమ్మారితో కొన్ని వందల కోట్ల ఆర్ధిక నష్టం వాటిల్లిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్ర పరిశ్రమలో ఎన్నడు కని వినీ ఎరగని విధంగా సంచలనాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు లాక్ డౌన్ కి ముందు అనుకున్న సినిమాలలో కొన్ని సినిమాలకి చాలా రకాలుగా మార్పుచేర్పులు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ప్రభాస్, పూరి జగన్నాధ్, సుకుమార్ లాంటి వాళ్ళ సినిమాలు విదేశాలలో షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నప్పటికి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో డ్రాపయ్యారు. 

 

IHG

ఆ షెడ్యూల్స్ లో చేయాల్సిన సీన్స్ ని ఇక్కడే తెరకెక్కించేందుకు ప్లాన్స్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసుకున్నారు. ఇక సినిమా బడ్జెట్ల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తాజా సమాచారం. ఈ నేపథ్యంలోనే న్యాచురల్ స్టార్ నాని నటించబోతున్న ఒక సినిమా బడ్జెట్ లో కొంత మార్పులు చేస్తున్నారట. నాని నిర్మాతల హీరో అన్న సంగతి తెలిసిందే. అందుకే హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా నాని తో సినిమాలు నిర్మించడానికి మేకర్స్ ఎప్పుడు సిద్దంగా ఉంటారు.

 

IHG

 

అయితే టాక్సీవాలా తో హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించనున్న 'శ్యామ్ సింగరాయ్' సినిమాకి ముందు అనుకున్న బడ్జెట్ 40 కోట్లు. 
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అంత బడ్జెట్ ని కేటాయించడం కాస్త రిస్క్ అని నిర్మాతలు భావిస్తున్నారట. ఇందుకు నాని కూడా నిర్మాతల వైపే నిలుచున్నాడని అంటున్నారు.

 

IHG'v\\'movie ...

అయితే సినిమా బడ్జెట్ మాత్రమేనా లేక ఆ బడ్జెట్ లో నాని రెమ్యూనరేషన్ కూడా ఉందా అన్నది క్లారిటి లేదు. ఇక ప్రస్తుతం నాని శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న 'టక్ జగదీష్' సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక సినిమా.. శ్రీకాంత్ అనే కొత్త కుర్రడు తెరకెక్కించే సినిమాలు కమిటయ్యాడు. ఈ సినిమాలు కంప్లీటవగానే 'శ్యామ్ సింగరాయ్' చేస్తాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: