భారతీయ సినిమా రంగంలో విలక్షణ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఎప్పటికప్పుడు వివాదాస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ సినిమాలు కూడా అదే రీతిలో చిత్రీకరిస్తారున్న విషయం అందరికి తెలిసిందే. అటువంటి రాంగోపాల్ వర్మ ఇటీవల ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పై అదే టైటిల్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ విషయం ఇటీవల మీడియాతో చెప్పడం జరిగింది. ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మ ని మించిపోయిన కాన్సెప్టుతో తెలుగు కుర్ర డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరు ‘కరోనా వాక్సీన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అ! అనే సినిమా వచ్చింది.

IHG

మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించి విమర్శకుల మెప్పు సాధించిన ప్రశాంత్ వర్మ రెండో ప్రయత్నంగా సీనియర్ నటుడు హీరో రాజశేఖర్ తో ‘కల్కి’ అనే సినిమా తెరకెక్కించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి పెద్దగా ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. కాగా తాజాగా ఇటీవల ‘కరోనా వాక్సీన్’ పేరిట సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. సినిమాకి సంబంధించి పోస్టర్ కూడా విడుదల చేశారు. ‘కరోనా వాక్సీన్’ …10% …లోడింగ్..ప్రిలిమినరీ టెస్ట్ అంటూ ఆసక్తికర పోస్టర్ ను పంచుకున్నాడు.

IHG

సినిమా పేరు, నటీనటులు ఇతర వివరాలు తెలియాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే అని తెలిపారు. దీంతో టైటిల్ చూసి చాలా మంది నెటిజన్లు రామ్ గోపాల్ వర్మ ని ప్రశాంత్ వర్మ మించి పోతున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరో వైపు తొలి చిత్రం అ! కు సీక్వెల్ కూడా తీయబోతున్నట్లు ప్రశాంత్ గతంలో ప్రకటించాడు. ప్రస్తుతం చేతిలో ఉన్న  సినిమా ప్రాజెక్టులు పూర్తి అయ్యాక ఆ తర్వాత అ! కు సీక్వెల్ ప్రశాంత్ తీయబోతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: