టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన సత్తా చాటాడు. ముఖ్యంగా వెంకటేష్ సినిమా అనగానే ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. ఇక ఆ ఇంట్రెస్ట్ కు తగినట్టుగానే వెంకీ ఫ్యామిలీ ఆడియెన్స్ కోసమే సినిమాలు చేశాడు. ఇక ఫ్యామిలీ తర్వాత వెంకటేష్ చేసే మరో జానర్ సినిమా సెంటిమెంట్. వెంకటేష్ అప్పటి చంటి నుండి సెంటిమెంట్ సినిమాలు చేస్తూ వచ్చాడు. తన అమాయకమైన పేస్ తో వెంకీ సెంటిమెంట్ పండిస్తుంటే ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. 


అంతేకాదు జీరో ఈగో హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది తప్పకుండా విక్టరీ వెంకటేష్ అని చెబుతారు. ఫ్యామిలీ, సెంటిమెంట్ సినిమాలే వెంకటేష్ కు స్టార్ క్రేజ్ తీసుకొచ్చాయి. మిగతా స్టార్స్ ఏవేవో ప్రయోగాలు చేస్తుంటే వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనెంట్ సినిమాలతో సంచలన విజయాలు అందుకున్నాడు. తెలుగు స్టార్స్ లో ఎక్కువ శాతం విజయాలు అందుకున్నాడు వెంకటేష్ అందుకే విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఇక వెంకటేష్ అనగానే రీమేక్ స్పెషలిస్ట్ అని  అంటుంటారు. తన కెరియర్ మొదటి నుండి వెంకటేష్ రీమేక్ సినిమాలు చేస్తూ వచ్చాడు. 


ఇక్కడ విశేషం ఏంటంటే.. వెంకటేష్ చేసిన రీమేక్ సినిమాలు అన్ని సూపర్ హిట్ అవడమే కాకుండా ఒరిజినల్ వర్షన్ హీరోల కన్నా వెంకటేష్ కు ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక ఇప్పటితరం హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్న ఏకైక హీరో కూడా వెంకటేష్ మాత్రమే. వాళ్ళతో చేస్తున్న టైం లో తన పాత్ర కొద్దిగా అటు ఇటుగా ఉన్నా సరే పెద్దగా పట్టించుకోడు. అంతేకాదు సినిమా వాళ్ళ గొడవల్లో కూడా తన ఇన్వాల్ మెంట్ ఉండదు. అందుకే వెంకటేష్ ను అందరు మిస్టర్ కూల్ అంటారు. అంతేకాదు ఆయన కామెడీ చేస్తే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వాల్సిందే. ప్రస్తుతం వెంకటేష్ నారప్ప సినిమా చేస్తున్నాడు. ఇది తమిళ సూపర్ హిట్ సినిమా అసురన్ కు రీమేక్ గా వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: