లాక్ డౌన్ టైమ్ లో చాలామంది నటీనటులు వెయిట్ పుటప్ చేశారు. రెగ్యులర్ గా వర్కవుట్స్ చేసినా.. ఖాళీగా కూర్చోవడం.. నచ్చింది తెగ తినేయడంతో.. కాస్త ఒళ్లు పెంచారు. కానీ ఓ యంగ్ హీరో మాత్రం కండలు పెంచాడు. ఒరిజినల్ గా ఫిట్ నెస్ తో ఉండే ఈ కుర్ర హీరో.. గడ్డంతో పాటు కండలు పెంచి సర్ ప్రైజ్ ఇచ్చాడు. 

 

ఆర్ ఎక్స్ 100 సినిమా పేరు చెబితే వెంటనే..యూత్ హార్ట్ బీట్ పెంచిన కార్తికేయ, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ జంట గుర్తుకువస్తుంది. ఆర్ ఎక్స్ 100 సూపర్ హిట్ అయినా.. ఆ తర్వాత నటించిన హిప్పీ.. గుణ..90ఎమ్ఎల్ చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో విలన్ యూ టర్న్ తీసుకొని..నాని గ్యాంగ్ లీడర్ తో అధృష్టం పరీక్షించుకున్నాడు. ప్రతినాయకుడిగా మంచి పేరు వచ్చినా.. కమర్షియల్ గా వర్కవుట్ కాకపోవడంతో డల్ అయిపోయాడు కార్తికేయ. 

 

పోయిన చోట వెతుక్కోవడం పెద్దలకే కాదు.. ఈ కుర్ర హీరోకు కూడా బాగా తెలుసు. విలన్ గా నటించిన గ్యాంగ్ లీడర్ ఫ్లాప్ అయినా.. మరోసారి ప్రతినాయకుడిగానే నటిస్తున్నాడు కార్తికేయ. అజిత్ నటిస్తున్న తమిళ చిత్రం వలిమైలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు ఈ తెలుగు హీరో. 

 

కార్తికేయ సిక్స్ ప్యాక్ తోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హిప్పీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అయితే.. చొక్కా విప్పేసి డ్యాన్స్ కూడా చేశాడు. రెగ్యులర్ గా జిమ్ లో కసరత్తులు చేసే కార్తికేయ లాక్ డౌన్ పీరియడ్ రెండు నెలల్లో సిక్స్ ప్యాక్ ను మరింత షేప్ తో షార్ప్ గా తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. 

 

తెలుగు విలన్ గా కంటే.. తమిళ విలన్ గా ఎక్కువ కష్టపడుతున్న ఈ యంగ్ హీరో విలన గా ఇంట గెలవకపోయినా.. రచ్చ గెలుస్తాడేమో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: