డైరక్టర్ అవ్వాలనుకుని అసిస్టెంట్ గా చేస్తూ ఇంద్రగంటి మోహనకృష్ణ అడిగాడని హీరోగా మారిన వ్యక్తి గంటా నవీన్ అతనే అండి మన నాని. నాచురల్ స్టార్ నానిగా స్క్రీన్ నేమ్ కూడా తెచ్చుకున్న నాని తన కెరియర్ లో ఎన్నో మలుపులు చూశాడు. ఒకానొక దశలో నాని కెరియర్ అయిపొయింది అని అనుకున్న టైం లో మళ్ళీ వరుస హిట్లతో దూసుకొచ్చాడు. నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అన్నట్టే. అందరి హీరోల అభిమానులు నాని సినిమా చూస్తారు. 

 

అంటే నాని సినిమా అనగానే కామన్ ఆడియెన్స్ ఎక్కువ ఉంటారన్నమాట. ఇక ఎంచుకున్న పాత్ర ఎలాంటిదైనా నాని చేసే నాచురల్ నటన సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. కేవలం ఒక లవర్ బోయ్ గా మాత్రమే కాకుండా వెరైటీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు నాని. అష్ట చమ్మ నుండి రాబోతున్న v వరకు నాని సినిమాల్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. స్వతహాగా పైకొచ్చిన నాని అంటే ప్రేక్షకులకు చాలా ఇష్టం. కేవలం సినిమాలతోనే కాదు బుల్లితెర మీద బిగ్ బాస్ షోకి హోస్ట్ గా కూడా చేశాడు నాని. 

 

ఎలాగైనా సరే ఆడియెన్స్ కు రీచ్ అవ్వాలని అది ఎలాంటి మాధ్యమం అయినా పర్వాలేదు అనుకుంటాడు నాని. అందుకే బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ గా కూడా చేశాడు. అయితే 3వ సీజన్ చేయాలని ఆఫర్ వచ్చినా తన వల్ల కాదని తేల్చి చెప్పాడు. ఇక లిమిటెడ్ బడ్జెట్ లోనే ప్రయోగాలు చేసే హీరోల్లో నాని ఒకరు. తెలుగు ప్రేక్షకులకు కొత్త కథలను పరిచయం చేయాలని తాపత్రయ పడుతుంటారు. నాని కెరియర్ లో చేసిన సినిమాలు చూస్తే హిట్ రేషియో ఎక్కువే ఉంటుంది. ఒక దశలో సంవత్సరానికి 3 సినిమాలు తీసి ఆ మూడింటితో హిట్టు కొట్టి సత్తా చాటాడు నాని. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన వి రిలీజ్ కు రెడీ అవుతుండగా నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీశ్ సినిమా చేస్తున్నాడు నాని. 

మరింత సమాచారం తెలుసుకోండి: