నిన్న బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాటు వద్ద చేసిన కామెంట్స్ పై నాగబాబు చాల తీవ్ర పదాలతో ఎదురు దాడి చేయడం ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది. వాస్తవానికి ఈ విషయంలో బాలకృష్ణను సపోర్ట్ చేస్తూ మాట్లాడే ఇండస్ట్రీ ప్రముఖులు ఇప్పటి వరకు ఎవరు ముందుకు రాకపోవడంతో బాలయ్య ఈ విషయంలో ఒంటరివాడు అయ్యాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత వారం రోజులుగా ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు తిరిగి షూటింగ్ లు ప్రారంభించడానికి ప్రభుత్వ అనుమతులు కోరుతూ అనేక రాయబారాలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈవిషయంలో చిరంజీవి ఇండస్ట్రీ పెద్దన్న పాత్రను పోషిస్తూ అందర్నీ కలుపుకుంటూ కరోనా దెబ్బతో అతలాకుతలం అయిపోతున్న ఇండస్ట్రీని కాపాడటానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు అన్వేషణ చేస్తున్నాడు.

 

కొద్ది రోజుల క్రితం చిరంజీవి ఇంటిలో ఈవిషయమై జరిగిన సమావేశానికి ఆతరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ తో జరిగిన సమావేశానికి చిరంజీవి నేతృత్వం వహించాడు. అన్ని సమావేశాలలోను చిరంజీవితో పాటు నాగార్జున కనిపించినా ఎక్కడా బాలకృష్ణ కనిపించక పోవడంతో చిరంజీవి బాలయ్యను ఆహ్వానించ లేదా లేకుంటే ఆహ్వానం వచ్చినా బాలయ్య స్పందించలేదా అన్న సందేహాలు చాలామందికి వచ్చాయి.

 

వీటన్నింటికి నిన్న బాలకృష్ణ చాల వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చాడు. నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాటుకు నివాళులు అర్పించడానికి వచ్చిన బాలయ్యను అక్కడ మీడియా వారు పలకరించి షూటింగ్ ల పునఃప్రారంభం విషయమై చిరంజీవి ఏర్పాటు చేసిన సమావేశాలకు ఎందుకు రాలేదు అంటూ బాలయ్యను మీడియా వర్గాలు ప్రశ్నించాయి. ఈప్రశ్నలకు బాలయ్య సమాధానం ఇస్తూ అటువంటి సమావేశాలు జరిగినట్లు తనకు మీడియాలో వచ్చిన వార్తలు ద్వారా మాత్రమే తెలిసిందని కామెంట్స్ చేస్తూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.

 

అంతేకాదు ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కనీవినీ ఎరుగని కష్టాలను ఎదుర్కుంటోంది అని కామెంట్స్ చేస్తూ ఈవిషయమై పెద్ద మనసు చేసుకుని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తూ షూటింగ్ ల ప్రారంభానికి చేయూతను ఇవ్వాలని తాను కూడ కోరుకుంటున్నాను అంటూ కామెంట్స్ చేసాడు బాలయ్య. అయితే బాలయి నిన్న మాట్లాడుతూ స్వతహాగా అతడిలో ఉండే ఆవేశాన్ని అణుచుకోలేకపోవడంతో ఇప్పుడు అతడి కామెంట్స్ ఇండస్ట్రీలొ హాట్ టాపిక్ గా మారి టాప్ హీరోల మధ్య ఉన్న ఇగోలు మళ్ళీ ఒకసారి బయటకు వచ్చాయి..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: