అల్లు అరవింద్... బహుసా టాలీవుడ్ లో ఈ పేరు తెలియని వారు ఉండరేమో... ఆ విధంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఎందరో అగ్ర హీరోలతో సినిమాలు చేయడమే కాదు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిర్మాత కూడా కావడం తో ఆయనకు మంచి ప్రాధాన్యత అనేది తెలుగు సినీ పరిశ్రమలో దక్కింది. కొడుకుని హీరోని చేసుకున్నారు. అలాగే చిరంజీవి కి ఇతర మెగా హీరోలకు ఆయన అండగా అనిలిచారు. తండ్రి హాస్య నటుడు అయినా సరే ఆయన నిర్మాతగా ఒక వెలుగు వెలిగారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు చేస్తుంటే అవి దాదాపుగా హిట్ అనే విధంగా ఉంటుంది. 

 

ఇక ఆయన సినిమాలు చేసిన ఎందరో హీరోలు స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలిగారు. అగ్ర హీరోలు అయ్యారు. టాలీవుడ్ ని శాసించే స్థాయిలో వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు అనేది వాస్తవం. ఇక మన తెలుగులో అయినా తమిళంలో అయినా సరే అల్లు అరవింద్ అంటే తెలియని వారు ఉండరు. ఆ విధంగా ఆయన సినిమాలను నిర్మించారు. ఇక ఆయన సినిమాలు ఇతర భాషల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన చిరంజీవి కి ప్రధాన   బలం అని కూడా చెప్తూ ఉంటారు. చిరంజీవి సినిమాలు ఎక్కువగా ఆయనతోనే చేస్తూ వచ్చారు. 

 

చిరంజీవి కూడా నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు. బావ మరిది అయినా సరే ఇద్దరూ కూడా స్నేహితులు మాదిరిగా ఉంటూ జీవితంలో అన్ని కూడా ఒకరితో ఒకరు షేర్ చేసుకునే పరిస్థితి ఉంటుంది అని అంటూ ఉంటారు. ఆ విధంగా చిరంజీవి ప్రభావితం చేసారు అల్లు అరవింద్ కెరీర్ లో కూడా. ఇక అల్లు అరవింద్ ఇప్పటికి కూడా అగ్ర నిర్మాత గానే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: