దిల్ రాజు... అతి తక్కువ కాలంలో స్టార్ నిర్మాతగా ఒక వెలుగు వెలిగిన నిర్మాత. ఎందరో స్టార్ హీరోలతో అతి తక్కువ కాలంలో మంచి సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిర్మాత ఆయన. స్టార్ హీరోల సినిమాలు అనగానే దిల్ రాజు నిర్మాత అయితే కచ్చితంగా హిట్ అవుతుంది అనే భావన లో కూడా చాలా మంది ఉంటారు. ఏ సినిమా పడితే ఆ సినిమా ఆయన చేయరు అని ఆయన సినిమా చేస్తే కచ్చితంగా మంచి పేరు ఉంటుంది అని ఏ హీరో అయినా సరే ఆయన తో సినిమా చేస్తే మంచి స్టార్ అవుతారు అని అంటూ ఉంటారు. 

 

నితిన్ ని టాలీవుడ్ లో స్టార్ హీరోని చేసింది ఆయనే అని అంటారు చాలా మంది. ఆయన తీసిన దిల్ సినిమా సూపర్ హిట్ కావడంతో సినిమా పేరే ఇంటి పేరు గా మారిపోయింది. ఇక ఆయన మాటను టాలీవుడ్ లో దాదాపుగా కాదు అనే పరిస్థితి ఉండదు అని అంటూ ఉంటారు టాలీవుడ్ జనాలు. ఆయనకు చాలా ప్రాధాన్యతను టాలీవుడ్ పెద్దలు కూడా ఇస్తూ ఉంటారు అనేది చాలా మంది దర్శక నిర్మాతలు టాలీవుడ్ గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పే మాట. అతి తక్కువ కాలంలో ఆయన స్టార్ నిర్మాత అయిపోయారు అనే విషయం అందరికి తెలిసిందే. 

 

ఇక ఆయన సినిమాలు ఈ మధ్య కాలంలో కాస్త ఫ్లాప్ అవుతున్నాయి. నిర్మాతగా కొన్ని ఇబ్బందులను ఆయన పడుతున్నారు అనేది టాలీవుడ్ లో కొందరు మాట్లాడే మాట. అయినా సరే ఆయన ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా సినిమాలను చాలా జాగ్రత్తగా చేస్తూ వస్తున్నారు. అగ్ర హీరోలతోనే ఆయన సినిమాలు అన్నీ కూడా దాదాపుగా ఈ మధ్య కాలంలో ఉంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: