ఏ ఎన్నార్... టాలీవుడ్ లో ఎంతో ప్రభావం చూపించిన వారిలో ఈయన పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలుగు సినిమా మొదలైన నాటి నుంచి ఆయన మరణించే వరకు దాని తోనే ఉన్నారు. వందల సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఆయన ప్రతీ సినిమాలో కూడా తన మార్క్ వేసుకున్నారు. హీరోగానే కాదు నిర్మాతగా కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే అప్పట్లో మహిళా ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూసిన సందర్భాలు కూడా ఉండేవి అనేది వాస్తవం. ఆ విధంగా ఆయన తన ప్రభావం చూపించారు. 

 

ఇక అన్నపూర్ణ స్టూడియో ద్వారా ఆయన ఎన్నో మంచి సినిమాలు చేసారు. ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి చెన్నై వెళ్లి ఆ తర్వాత తెలుగులో ఆయన చేసిన సినిమాలు ఆయన సినిమాలు సాధించిన విజయాలు ఎవరూ కూడా సాధించలేదు అనేది వాస్తవం. ఆయన ప్రతీ సినిమా కూడా చాలా బాగా విజయం సాధించింది ఇక ఆయన కు ముందు నుంచి కూడా టాలీవుడ్ లో మంచి పేరు ఉంది అనేది వాస్తవం. ఆయన మాటను ఎవరూ కూడా కాదు అనే వారు కాదు. ఆయనకు అందరి తో కూడా మంచి స్నేహం కూడా ఉంది ఏ స్థాయిలో స్టార్ హీరో అయినా సరే ఆయన ఏ రోజు కూడా దానిని చూపించే ప్రయత్నం చేసిన సందర్భం అనేది ఎక్కడా కూడా లేదు. 

 

తన కొడుకు ని స్టార్ హీరో చేసినా సరే ఆయనకు అందరి తో కూడా మంచిగా పేరు తీసుకొచ్చారు. ఎవరి తో కూడా వివాదాలు లేకుండా ఆయన తన మనవడు సుమంత్ ని కూడా సినిమాల్లోకి తీసుకొచ్చినా అతన్ని కూడా ప్రేక్షకులు ఆదరించారు అనే చెప్పవచ్చు. ఇక ఆయన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా సరే ఎక్కడా కూడా స్టార్ అనేది చూపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: