ఎన్టీఆర్... తెలుగు సినిమాను శాసించింది ఈ పేరు. అక్కినేని తర్వాత స్టార్ హీరో గా ఆయన వచ్చినా సరే ఆయన చేసిన సినిమాలు అవి సాధించిన విజయాలు ఆయనకు వచ్చిన అంతు లేని పేరు ఎవరికి అంత తక్కువ కాలంలో రాలేదు అనేది వాస్తవం. ఆయనను చూసి హీరోలు అయిన వారు ఆయన ను చూసి సినిమాల్లోకి వచ్చిన వారు ఆయనను చూసి నటన నేర్చుకున్న వారు ఎందరో మనకు కనపడుతూ ఉంటారు. ఆయన  అతి తక్కువ కాలంలో స్టార్ హీరో అయ్యారు. అక్కడి నుంచి తెలుగు వారికి కనపడే దైవం అయ్యారు. 

 

ఇక ఆయన సినిమాలు ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు ఎన్ని చేసినా సరే ఆయనకు ఎంత పేరు వచ్చినా సరే ఆయన మాత్రం ఎక్కడా కూడా తన స్థాయిని మరువకుండా నే ప్రవర్తించారు సినిమాలు చేసారు అనేది వాస్తవ౦. ఆయనకు ఉన్న పేరు ఇప్పటి హీరోలలో ఎవరికి కూడా అతి తక్కువ కాలంలో వచ్చింది లేదు. ఇక ఆయన తెలుగు సినీ పరిశ్రమలో రారాజు గా ఉన్నారు అనేది ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఆయన మాటను ఎవరు కాదు అనేలేని విధం గా ఆయన చేసారు అని చెప్పవచ్చు. 

 

ఆయన ను ఎదిరించి ఏదీ కూడా చేసే పరిస్థితి తెలుగు సినిమాలో ఉండేది కాదు అనే విషయం అందరికి తెలుసు. ఆయనను చాల అమంది తెలుగు సినిమాలోనే అభిమానించారు ఆదరించారు. ఆయనను చాలా మంది దేవుడి గా కూడా చూసారు ఆయన వద్దకు వెళ్తే సినీ పరిశ్రమలో ఏ సమస్య అయినా సరే పరిష్కారం అవుతుంది తమకు అండ   దొరుకుతుంది అనే విధంగా అప్పట్లో పరిస్థితి ఉండేది అని ఆయనను దగ్గరగా చూసిన వారు ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: