టాలీవుడ్ లో రానా పెళ్లి పై జనాలకు ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్స్ గా ఉన్న హీరోల‌పై నిన్న‌టి వ‌ర‌కు మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ? అని సెటైర్లు ప‌డేయ్‌. అయితే ఇప్పుడు రానా ఈ గ్రూప్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాడు. కొద్ది రోజులుగా రానా పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఆశ్చర్యంగా ఆసక్తిగా జనాలు ఎదురు చూస్తున్నారు. అతను వచ్చే ఏడాది మొదట్లో లేదా ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు రానా పెళ్లి పనుల్లో బిజీ గా ఉన్నాడని అందరూ భావిస్తున్నారు. అయితే అది కాదని సమాచారం.

IHG

అతను ఇప్పుడు రెండు సినిమాలను చేస్తున్నాడు. ఈ సినిమా తో పాటుగా బాలీవుడ్ లో తమిళం లో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత అతను తెలుగులో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. అయితే ముందే ఎంగేజ్ మెంట్ చేసుకోవడానికి ఒక సెంటిమెంట్ ఉందని అందుకే అతను చేసుకున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీని వెనుక బల‌మైన కారణం ఉంది అనేది టాలీవుడ్ జనాల మాట.

IHG

దీని వెనుక వాస్తవం ఎంత ఉంది అనేది తెలియదు గాని... ఈ పెళ్లి కూడా ఒక డేట్ లో జరుగుతుంది అని ఆ డేట్ కూడా రానా కి ప్రత్యేకం అని అది కూడా త్వరలోనే ఉంది అని అంటున్నారు. ఇక రానా హైద‌రాబాద్ కు చెందిన మిహీకా బ‌జాజ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లాడ బోతోన్న సంగ‌తి తెలిసిందే. మిహీకా బాలీవుడ్ లో బ‌జాజ్ ల కుటుంబానికి చెందిన అమ్మాయి. వీరిద్ద‌రు ఓ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా ముంబైలో ప‌రిచ‌యంతో ప్రేమికులు గా మారిన సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: