తమిళ నటుడు సూర్యకి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. తమిళంలో సూపర్ స్టార్ అయిన సూర్యకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే గత కొన్ని రోజులుగా సూర్య సినిమాలేవీ తెలుగులో సరిగ్గా ఆడట్లేదు. ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో ఆకాశం నీ హద్దురా అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అయితే సూర్య ఎన్ని సినిమాలు చేసినా డైరెక్ట్ తెలుగు సినిమాలో కనిపించలేదు.

 

కానీ సూర్య తమ్ముడు మాత్రం తెలుగు సినిమాలో నటించాడు. అన్న తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కార్తి, తెలుగు స్పష్టంగా మాట్లాడటమే కాదు వంశీ పైడిపల్లి ఊపిరి సినిమాలో నటించి విజయం అందుకున్నాడు. అయితే వీరిద్దరూ కలిసి నటించే సమయం వచ్చేసిందని కొలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అన్నదమ్ములిద్దరూ సక్సెస్ లతో దూసుకుపోతున్నా ఇద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు.

 

ప్రస్తుతం వీరిద్దరూ ఆ దిశగా అడుగులు వేయనున్నారని అంటున్నారు. మళయాలంలో సూపర్ హిట్ అందుకున్న అయ్యప్పనుం కోషియం చిత్ర తమిళ రీమేక్ లో వీరిద్దరూ కలిసి నటించనున్నారని అంటున్నారు. పృథ్వీరాజ్, బిజూ మీనన కలిసి చేసిన ఈ చిత్రం మళయాల బాక్సాఫీసుని షేక్ చేసింది. దాంతో అన్ని ఇండస్ట్రీల కన్ను ఈ సినిమాపై పడింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తమిళ రీమేక్ హక్కులని సూర్య దక్కించుకున్నాడని టాక్ వినబడుతుంది.

 

ఒకవేళ వీరిద్దరూ కలిసి నటిస్తే ఈ సినిమా రేంజే మారిపోతుంది. అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ హక్కులని హారికా హాసినీ క్రియేషన్స్ లో భాగమైన సితార ఎంటర్ టైన్ మెంట్స్ దక్కించుకోగా దర్శకుడి కోసం వెతుకుతోంది. అలాగే ఈ చిత్ర బాలీవుడ్ హక్కులని జాన్ అబ్రహం నిర్మాణ సంస్థ జేఏ ఎంటర్ టైన్ మెంట్స్ దక్కించుకుంది. మరి సూర్య కార్తిలు ఈ సినిమా దారా అయినా కలిసి నటిస్తారా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: