దర్శకధీరుడు తెరకెక్కించిన బాహుబలి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పటి వరకూ ఎవరూ కలలో కూడా ఊహించడానికి సాహసించని వారికి బాహుబలి సినిమాతో భారతీయ సినిమా ప్రతిష్టని ప్రపంచానికి చాటాడు. తెలుగు సినిమాగా రిలీజై భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. బాహుబలి తర్వాతి నుండి తెలుగు సినిమా గతి పూర్తిగా మారిపోయింది.

 

 

తెలుగు సినిమాలకి మార్కెట్ పెరిగింది. తెలుగు సినిమా కథల్లో చాలా మార్పొచ్చింది. అందుకే తెలుగు సినిమా నుండి పాన్ ఇండియా సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే బాహుబలి సినిమా ఇప్పటి వరకు ఎన్నో ఘనతల్ని సొంతం చేసుకుంది. ప్రపంచంలోని చాలా చోట్ల ప్రదర్శితమై గౌరవాన్ని తెచ్చుకుంది. ప్ర్పతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శితమైన మొట్టమొదటి నాన్ ఇంగ్లీష్ చిత్రంగా బాహుబలి నిలిచింది.

 

 

అయితే తాజాగా బాహుబలి మరో రికార్డుని సొంతం చేసుకుంది. ప్రపంచ దేశాల ప్రజల్ని ఉర్రూతలూగించిన బాహుబలి రష్యా టెలివిజన్లో ప్రసారం అవుతుంది. రష్యన్ భాషలో బాహుబలి సినిమా అక్కడ ప్రసారమై మరో ఘనతని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమాకీ ఇలాంటి గుర్తింపు దక్కలేదు. రష్యా టెలివిజన్ బ్రాడ్ క్యాస్టింగ్ సంస్థ బాహుబలిని ప్రసారం చేసింది.

 

 

ఈ విషయాన్ని రష్యన్ ఫెడరేషన్ ఎంబసీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో 'బాహుబలి: ద కన్క్లూజన్'కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసి.. రష్యాలో ఒక టీవీ చానల్లో ఆ మూవీ ప్రసారమవుతోందని తెలిపింది. భారతీయ ప్రజలు గర్వించదగ్గ చిత్రం ప్రపంచ దేశాల సినీ ప్రేమికుల్ని మెప్పిస్తుందంటే అంతకన్నా గొప్పవిషయం మరోటి ఉండదు. దీనికి కారణమైన రాజమౌళిని, ప్రభాస్ నీ, నిర్మించిన ఆర్కా మీడియా వారికి ఎన్ని సత్కారాలు చేసినా తక్కువే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: