నరసింహ సినిమా నుంచి కూడా రమ్యకృష్ణ కు మంచి డిమాండ్ అనేది మన తెలుగులో వచ్చింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్ప‌టి వ‌ర‌కు త‌న న‌ట‌న‌లో కేవ‌లం గ్లామ‌ర్ కోణం ఎక్కువుగా చూపించిన ర‌మ్య‌కృష్ణ ఆ సినిమాలో లేడీ విల‌న్‌గా చేసిన న‌ట విశ్వ‌రూపంతో యావ‌త్ ద‌క్షిణ భార‌త సినీ ప్రేమికులు ఆమెకు ఫిదా అయిపోయారు. అప్ప‌టి వ‌ర‌కు హీరోయిన్ గా ఉన్న ఆమెకు ఆ సినిమా నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది అనే విషయ ౦ తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమెకు బాహుబలి సినిమా అంతకు మించిన మంచి పేరు తీసుకొచ్చింది అని  కూడా తెలుసు. ఇక ఇప్పుడు అదే ఆమెకు బాగా కలిసి వచ్చింది.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్నాడు అన్న వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటించే అవకాశం ఉందని సమాచారం. ఆమెకు తెలుగుతో పాటు అటు తమిళం లో మంచి క్రేజ్ ఉన్న నేపధ్యంలో ఆమెను ఆ సినిమాలో తీసుకుంటే... ఈ సినిమాకు తమిళంలో కూడా మంచి క్రేజ్ వ‌స్తుంది అని దర్శకుడు బన్సాలి భావిస్తున్నాడు అని అంటున్నారు. ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా సినిమా రేంజ్‌లో తెర‌కెక్కిస్తార‌ట‌.

 

ఇక ఆమె ఆ సినిమాలో ఎన్టీఆర్ కి తల్లిగా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఆమె గ‌తంలో నా అల్లుడు సినిమాలో ఎన్టీఆర్‌కు అత్త‌గా న‌టించింది. ఆ సినిమాలో ఆమె కోసం ముందే ప్లాన్ చేసాడని ఎన్టీఆర్ ని ఒక మాట అడగగా తారక్ కూడా అందుకు ఓకే చెప్పాడని సమాచారం. ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు గాని దాదాపుగా 2022 కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. త్రివిక్రమ్ సినిమా కాగానే ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: