ఉత్తమ భారతీయ సినిమా నిర్మాతగా పేరు పొందిన దగ్గుబాటి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ కి యజమాని గా ఉంటూ తెలుగు ఇండస్ట్రీలో బొబ్బిలి రాజా కూలి నెంబర్ వన్ లాంటి హిట్ చిత్రాలను ఎన్నో ప్రేక్షకులకు అందించాడు. రామానాయుడు, రాజేశ్వరి దంపతులకు పెద్ద కొడుకుగా, విక్టరీ వెంకటేష్ కు అన్నయ్యగా వందల యాభై ఎనిమిది డిసెంబర్ 24వ తేదీన సురేష్ బాబు జన్మించాడు. తను యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ లో ఇంజనీరింగ్ చదువును పూర్తి చేశాడు. తన కుమారుడు ఐన రాణా దగ్గుబాటి 2010లో విడుదలైన లీడర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోగా గా సుపరిచితుడు అయ్యాడు. తాను బాహుబలి చిత్రంలో భల్లాలదేవ గా నటించి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత సంపాదించాడు. 

IHG
నిజానికి దగ్గుబాటి సురేష్ 1982 వ సంవత్సరంలో విడుదలైన దేవతా సినిమాకి నిర్మాతగా బాధ్యతలు వహించాడు కానీ బొబ్బిలి రాజా సినిమా నుండే తాను నిర్మాతగా పేరు వేయించుకున్నాడు. సురేష్ బాబు ఎక్కువగా తన తమ్ముడు అయిన వెంకటేష్ ని హీరోగా తీసుకొని ప్రేమించుకుందాం రా, జయం మనదేరా, కలిసుందాం రా లాంటి చిత్రాలను తీశాడు. అవన్నీ సూపర్ హిట్ గాని రావడంతో తనకు బాగానే లాభాలు వచ్చాయి. 

IHG
2003వ సంవత్సరంలో ఉదయ్ కిరణ్, శ్రియా శరణ్ హీరో హీరోయిన్లుగా నటించిన నీకు నేను నాకు నువ్వు సినిమా తెరకెక్కించిన అందుకుగాను నంది అవార్డు అక్కినేని అవార్డు సురేష్ బాబు కి లభించింది. 2014వ సంవత్సరంలో మలయాళ రీమేక్ అయినా దృశ్యం సినిమా లో వెంకటేష్ మీనా కథానాయకుడు నాయికగా నటించగా... ఆ చిత్రం తక్కువ బడ్జెట్ తో రూపుదిద్దుకోని పది రెట్ల లాభాలను సంపాదించుకుంది. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా నటిస్తున్న నారప్ప చిత్రానికి కూడా సురేష్ బాబు నిర్మాతగా బాధ్యతలను చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: