నిర్మాత డి.రామానాయుడు గురించి తెలిసిన వారే తప్ప తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ ఆర్టికల్ ద్వారా తను సినీ కెరీర్ లో ఎలా రంగప్రవేశం చేశారో తెలుసుకుందాం. 1958 వ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామానికి తన సినిమా నమ్మినబంటు షూటింగ్ నిమిత్తం వచ్చారు. అయితే అదే గ్రామంలో ఉన్న డి రామానాయుడు అక్కినేని నాగేశ్వరరావు కోసం ఎన్నో పనులను ఎంతో ఉత్సాహంగా చేసి పెట్టారు. డి.రామానాయుడు అప్పటికే ఎన్నో వ్యాపారాల్లో దూసుకెళ్తున్నాడు. అది తెలుసుకున్న ఏఎన్ఆర్... ఏమండి రామానాయుడు గారు, మీరు బాగా వ్యాపారాలు చేస్తారంట కదా. సినిమా నిర్మాతగా అవతారం ఎత్తితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పారట. కానీ తనకు వ్యవసాయ పనులు, వ్యాపారాలు తప్ప సినిమాల గురించి అవగాహన లేదని సున్నితంగా తన తిరస్కారం వ్యక్తం చేశాడట రామానాయుడు. 

IHG
సంవత్సరాలు గడిచిన తర్వాత తన రైస్ మిల్లులపై ఇన్కమ్ టాక్స్ రైడ్ జరగగా... సరైన బిల్లులు లేని కారణంగా రెండు లక్షల రూపాయల జరిమానా విధించారు అధికారులు. దాంతో తాను నిజాయితీగా రైసుమిల్లు నడుపుతున్నానని... తాను ఏమి తప్పు చేయడం లేదని డి.రామానాయుడు కోర్టులో కేసు వేసి... ఆ కేసు గెలిచిన తర్వాత తన రైస్ బిజినెస్ కి గుడ్ బాయ్ చెప్పాడు. అప్పట్లో బస్సులన్నిటిని నేషనలైజ్ చేయడంతో తను ప్రైవేటుగా నడిపిస్తున్న బస్సుల వ్యాపారం కూడా మూసివేయబడింది. 

IHG
ఆ విధంగా తన వ్యాపారాలన్నిటికీ స్వస్తి చెప్పి క్రమక్రమంగా డబ్బింగ్ సినిమాల లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. అనురాగం అనే మొదటి సినిమా లో ఎంతో డబ్బును పెట్టినప్పటికీ నష్టాలు మాత్రమే మిగిలాయి. ఆ తర్వాత తను ఏ మాత్రం భయం లేకుండా.. 75 శాతం పెట్టుబడి పెట్టి 25% స్లీపింగ్ పార్టనర్స్ తో కలిసే తానే స్వయంగా ఒక సినిమా నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. కొసరాజు రాఘవయ్య చౌదరి ని కలిసి తనకి మంచి రచయితను, డైరెక్టర్ ను పరిచయం చేయవలసిందిగా కోరగా... అతడు రచయిత నరసరాజుని, డైరెక్టర్ తాపీ చాణక్య ని పరిచయం చేశాడు. తదనంతరం రచయిత దగ్గర రాముడు భీముడు డ్యూయల్ రోల్ కథను విన్న డి.రామానాయుడికి కథ బాగా నచ్చింది. దాంతో ఎన్టీ రామారావు ఈ సినిమాలో నటింప చేస్తే బాగుంటుందని అతడి వద్దకు వెళ్లి అడగగా ఎన్టీరామారావు ఓకే చెప్పేశారు. ఆ తర్వాత వెంటనే సినిమాలో కావాల్సిన ఎక్కడ తారాగణం కోసం అందరిని ఎంపిక చేసుకొని తాపీ చాణక్య తో కలిసి రాముడు భీముడు సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ కింద 1964 మే 21న తెరకెక్కించ గా అది ఘన విజయం సాధించింది. దాంతో రామానాయుడికి లాభాల పంట పండింది. 

IHG

ఆ సమయంలోనే సురేష్ ప్రొడక్షన్ లోగో రూపొందించేందుకు వెంకటేష్ సురేష్ లను నిల్చోబెట్టి ఫోటో తీసి వాళ్ళిద్దరి ఫోటోలను sp బంగ్లా అక్షరాలపై వచ్చేలా చేశారు. తదనంతరం ఎన్టీఆర్ తో కలిసి కృష్ణుడు కథ నేపథ్యంలో రూపొందించాలి అని అనుకున్న ఓ సినిమాలో నటించమని అడగ్గా తాను అప్పటికే ఓ కృష్ణుడి పాత్రలో నటించానని వేరొక కథతో రావాలని సూచించారు. ఆ క్రమంలోనే కాంతారావు తో కలిసి ప్రతిజ్ఞ పాలన అనే పౌరాణిక సినిమాని తెరకెక్కించే హిట్ ని అందుకొని లక్ష రూపాయల లాభం సంపాదించాడు. ఆ తర్వాత ఏఎన్ఆర్ ఎన్టీఆర్ జగ్గయ్య లతో చేసిన ఆరు సినిమాలు అట్టర్ ప్లాప్ కాగా... రూ. 12 లక్షల అప్పులతో డి.రామానాయుడు చాలా కృంగిపోయాడు. అనంతరం ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుంటే కె.ఎస్.రవికుమార్ రామానాయుడికి అరికెపూడి కౌసల్యాదేవి రాసిన నవలను వినిపించి.... ఈ నవల ఆధారంగా ఓ సినిమా తీస్తే బాగుంటుందని సూచించారు. దాంతో చిట్టచివరి ప్రయత్నంగా డి రామానాయుడు ఏదైనా అవ్వనివండి అనే ధైర్యంతో ఈ సినిమాని 15 లక్షల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. 

IHG
ప్రేమ్ నగర్ అనే శీర్షికతో 1971లో వచ్చిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ హీరో హీరోయిన్ల గా నటించారు. అయితే సినిమా విడుదలైన సమయంలో బీభత్సమైన తుఫాను రావడంతో సినిమా థియేటర్లకు ఎవరూ రారని... ఈ సినిమా కూడా పరాజయం పొందుతుందని డి.రామానాయుడు, ఇతర చిత్రబృందం ఆందోళన చెందారు. కానీ అంత పెద్ద తుఫానులో కూడా థియేటర్లకు వేలసంఖ్యలో ప్రజలు తరలి వచ్చి సినిమాను చూసి ఇలాంటి సినిమా తెలుగు పరిశ్రమలో ఎన్నడూ రాలేదని పాజిటివ్ రివ్యూలను ఇవ్వడం ప్రారంభించారు. దాంతో ప్రేమ్ నగర్ చిత్రం భారీ హిట్ అయ్యి రామానాయుడికి ఎన్నో లక్షల రూపాయలను సంపాదించి పెట్టింది. తర్వాత 12 లక్షల అప్పు కూడా రామానాయుడు తీర్చేసాడు. ఆ విధంగా వరుస పెట్టి అనేక సినిమాలను తన సొంత బ్యానర్ కింద నిర్మించి ఒక గొప్ప నిర్మాతగా పేరు పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: