దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి కాగా అతను నేషనల్ అవార్డు విన్నర్ అయిన భారతీయ ఫిలిం నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా నిలిచాడు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సినిమా నిర్మాణ సంస్థను స్థాపించి అనేకమైన హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. 2003వ సంవత్సరంలో వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన దిల్ చిత్రం దిల్ రాజు నిర్మాణంలో నే రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో నితిన్ హీరో గా, నేహా బాంబ్ హీరోయిన్ గా, వేణుమాధవ్ సైడ్ క్యారెక్టర్ గా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నిర్మాత అయిన వెంకటరమణారెడ్డి కి దిల్ రాజు అనే పేరు వచ్చింది. 

IHG' film <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MR PERFECT' target='_blank' title='mr perfect-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>mr perfect</a> in trouble: <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PRODUCER1' target='_blank' title='producer-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>producer</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DIL RAJU' target='_blank' title='dil raju -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>dil raju </a>booked for ...
2004, 2005, 2006 ఇలా వరుస పెట్టి ఆర్య భద్ర బొమ్మరిల్లు లాంటి సినిమాలకు నిర్మాతగా బాధ్యతలను చేపట్టిన దిల్ రాజుకు ఎన్నో కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఆ తర్వాత కూడా అనేకమైన సినిమాలు వచ్చాయి కానీ వాటిలో కొన్ని అట్టర్ ఫ్లాప్ గా నిలిచి దిల్ రాజుకు నష్టాలను మిగిల్చాయి. 2010వ సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బృందావనం సినిమాకి నిర్మాతగా బాధ్యతలు చేపట్టిన దిల్రాజుకు ఆ సినిమా హిట్ కావడంతో బాగానే లాభాలు వచ్చాయి. 

IHG's shooting line up
ఆ తర్వాత వచ్చిన సినిమాలు యావరేజ్ టాక్ ను సంపాదించుకోగా... 2013వ సంవత్సరంలో మల్టీస్టారర్ తారాగణంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి పలు భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచి నిర్మాత ఐన దిల్ రాజుకు వందల కోట్ల రూపాయలను సంపాదించిపెట్టింది. 2017 వ సంవత్సరం లో శతమానంభవతి తీసిన అందుకుగాను అతనికి 64వ నేషనల్ ఫిలిం అవార్డు కార్యక్రమంలో ఉత్తమ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన అందుకుగాను నేషనల్ ఫిలిం అవార్డు దిల్ రాజు కు లభించింది. ఆ తర్వాత వచ్చిన నేను లోకల్ ఫిదా, ఎఫ్ 2 చిత్రాలు తక్కువ బడ్జెట్లోనే రూపుదిద్దుకొని నిర్మాత దిల్ రాజుకు వందల కోట్ల రూపాయలను గడించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: