తెలుగు సినిమా దర్శకుల గొప్పదనం గురించి అందరికీ తెలిసిన విషయమే. మన సినిమాకు మొదటి దశలో కూడా వెలుగులు నింపిన మేటి దర్శకులు ఉన్నారు. వారిలో ప్రముఖుడు సి.పుల్లయ్య. కాకినాడకు చెందిన ఈయన 1920వ దశకంలో కాంగ్రెస్ లో చేరేందుకు కలకత్తా వెళ్లి పరిస్థితుల దృష్ట్యా సినిమాల్లో చేరారు. 1921లో ఆర్ఎస్ ప్రకాశ్ తీసిన భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ సినిమాకు సహాయకుడిగా పని చేశారు. తర్వాత కాకినాడలోనే తన ఇంట్లోనే సెట్లు వేసి మార్కండేయ అనే సినిమా తీసి ప్రదర్శించారు. ఇందుకోసం కాకినాడలో సిటీ ఎలక్ట్రిక్ అనే పేరుతో టెంటు హాలు నిర్మించారు.

IHG

 

అనంతరం ఇందులో చాలా మూకీ సినిమాలు ఆడాయి. సినిమా ప్రదర్శనల కోసం సినీ సామాగ్రితో ఆంధ్ర, ఒరిస్సా, బెంగాల్ కూడా తిరిగి ప్రదర్శించేవారట. టాకీ సినిమాలు మొదలయ్యాక ఆయన 1933లో సతీ సావిత్రి సినిమా తీశారు. ఈ సినిమా విజయం తర్వాత అనేక సినిమాలు తీశారు. సి.పుల్లయ్య తీసిన సినిమాల్లో నేటికీ అద్భుతంగా నిలిచిపోయిన సినిమా లవకుశ. ఎన్టీఆర్, అంజలీదేవి నటించిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయింది. అప్పట్లో బెంగాలీలో 'లవకుశ' ప్లాన్ చేసారు. తెలుగులో పుల్లయ్య ఈ సినిమా తీయడానికి రెడీ అయ్యారు. తనయుడు సి.యస్.రావుతో కలిసి పుల్లయ్య 1963లో తీశారు. తెలుగులో తొలి రంగుల చిత్రంగా లవకుశ రికార్డు సృష్టించింది.

IHG

 

పుల్లయ్య తీసిన అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఇదీ ఒకటి. ఆ తర్వాత ఆయన పరమానందయ్య శిష్యుల కథ, భామా విజయం, పక్కింటి అమ్మాయి, వర విక్రయం, దేవాంతకుడు, భువనసుందరి కథ, బాలనాగమ్మ, సంక్రాంతి, అపూర్వ సహోదరులు.. వంటి హిట్ చిత్రాలు ఎన్నింటినో తెరకెక్కించారు. తెలుగు సినిమా తొలి తరం దర్శకుడిగా ఖ్యాతి గడించిన సి పుల్లయ్య 1967లో చెన్నైలో మరణించారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: