జయసుధ... ఒక హీరోయిన్ అయినా సరే ఆమెకు వచ్చిన పేరు ఎవరికి తక్కువ కాలంలో రాలేదు. ఆమె సినిమాలు గాని ఆమెకు వచ్చిన పేరు గాని ఎవరికి రాలేదు. అగ్ర హీరోలు అగ్ర దర్శకులు అగ్ర నిర్మాతలు అందరి తో కూడా ఆమె సినిమాలు చేసారు. ఆమె సినిమాలు అన్నీ కూడా చాలా మంచి విజయం సాధించాయి. ఎందరో స్టార్ హీరోలతో ఆమె హీరోయిన్ గా పని చేసారు. ఎందరో స్టార్ హీరోలకు ఆమె తల్లి గా కూడా పని చేసారు. మంచి పేరు తెచ్చుకుని సినిమాల్లో ఆమె దూసుకుపోయారు. 

 

ఇక ఆమె తెలుగు సినిమాలో చాలా వరకు తన ప్రభావం చూపించిన సందర్భాలు ఉన్నాయని అంటారు. ఆమె మాటను కాదు అనే వారు ఎవరూ కూడా ఉండే వారు కాదు అని అంటారు. ఆమె కు చాలా ప్రాధాన్యత హీరో లు కూడా ఇచ్చే వారు. ఆమె సినిమాల్లో నటించినా సినిమాలకు దూరంగా ఉన్నా సరే సినిమా వాళ్ళు ఆమెను ఎప్పుడు కూడా పక్కన పెట్టిన సందర్భం అనేది లేదు అని అంటారు టాలీవుడ్ జనాలు. ఆ విధంగా ఆమె పేరు తెచ్చుకుని దాన్ని కాపాడుకున్నారు కూడా. సహజ నటిగా ఆమెకు  మంచి పేరు వచ్చింది చాలా తక్కువ కాలంలోనే. 

 

ఇక ఆమె నటనకు చాలా ప్రాధాన్యత ఉండేది. ఇక ఆమె సినిమాల్లో ఉంది అంటే ఆ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. ఆ విధ౦గా జయసుధ తన మార్క్ వేసారు. ఇక రాజకీయాలతో కూడా ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి అనేది వాస్తవం. రాజకీయ నాయకులతో కూడా ఆమె ఎప్పటికప్పుడు మంచి సంబంధాల ను కొనసాగించారు గాని ఎక్కడ అకుడా వివాదాల దిశగా ఆమె వెళ్ళిన సందర్భం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: