తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు  హీరోయిన్లు కమెడియన్ లుగా  ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొత్తగా వచ్చిన వాళ్ళ కంటే కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికీ సాధ్యం కాని గుర్తింపును సంపాదించిన వారు ప్రస్తుతం నేటి తరానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్న వారు చాలా మంది ఉన్నారు.  నాటి తరం నుంచి నేటి తరం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో హవా నడిపిస్తూ... అదే క్రేజ్ తో దూసుకుపోతున్న వారిలో మొదట గా వినిపించే పేరు బ్రహ్మానందం. తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యబ్రహ్మ బిరుదును పొందిన కమెడియన్ బ్రహ్మానందం.. ప్రస్థానం మొదటి నుంచి ఎంతో విజయవంతంగా సాగింది అనే చెప్పాలి. 

 

 దాదాపుగా రెండు మూడు దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో బ్రహ్మానందం ప్రస్థానం విజయవంతంగా దూసుకుపోతోంది. మధ్యలో ఎంతో మంది కొత్త కమీడియన్స్ వచ్చారు పోయారు కానీ బ్రహ్మానందం క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రతి తెలుగు ప్రేక్షకుడు బ్రహ్మానందం ని చూస్తే చాలు పగలబడి నవ్వుకునేంతల  ప్రేక్షకులను ప్రభావితం చేశారు బ్రహ్మానందం. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కొత్త కమిడియన్ లు  వచ్చినప్పటికీ కామెడీతో ప్రేక్షకులను నవ్వించినప్పటికీ... హాస్యబ్రహ్మ బ్రహ్మానందానికి ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.  ముఖ్యంగా బ్రహ్మానందం హావభావాలు ముఖ కవళికలు అయితే ఎప్పటికీ ప్రేక్షకులకు ఫేవరెట్ గా నిలుస్తూ ఉంటాయి. 

 


 అందుకే బ్రహ్మానందం నాటి తరం ప్రేక్షకుల నుంచి నేటి తరం ప్రేక్షకుల వరకూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ హాస్య నటుడిగా ఎంతో విజయవంతమైన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అయితే హాస్య నటుడిగా బ్రహ్మానందం కి వచ్చినంత క్రేజ్ ఎవ్వరికీ రాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కొత్త కమెడియన్స్ వచ్చినప్పటికీ... ఇప్పటికీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ కమెడియన్గా బ్రహ్మానందం కొనసాగుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మామూలుగా అయితే మిగతా కమెడియన్స్ సినిమాల్లో కామెడీ చేయలేమో... కానీ బ్రహ్మానందం సినిమాలో కనిపిస్తే చాలు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు... అందుకే బ్రహ్మానందం తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభావితం చేసిన వారిలో ఒకరిగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: