దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ అయిపోతుంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా వైరస్ మాత్రం కంట్రోల్ కావట్లేదు. ముఖ్యంగా ప్రజలు లాక్ డౌన్ సమయంలో రోడ్లపై తిరుగుతూ కరోనా వ్యాప్తి చెందుటకు దోహదం చేస్తూ ఉన్నారు. గత మూడు నెలల నుండి లాక్ డౌన్ నేపథ్యంలో భారత దేశ ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. ఇటువంటి పరిస్థితుల్లో మరో ప్రమాదం భారత్ ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. 

 

ఇక తాజాగా ఒకవైపు భారతదేశాన్ని కరోనా ఇబ్బంది పెడుతుంటే మరోవైపు దేశంలో మిడతల దండు ప్రస్తుతం పంట పొలాలను నాశనం చేస్తూ వెళుతుంది. దీనితో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇకపోతే భారత్లోని తాజా రెండు పరిస్థితులను తమిళ దర్శకులు ముందుగానే ఊహించి వెండితెరపై వీడిని ఆవిష్కరించారు. ఒక వైరస్ అనేది ఎలా వ్యాప్తి చెందుతుందో దాని వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న పరిస్థితిపై హీరో సూర్య నటించిన సెవెంత్ సెన్స్ సినిమాలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. 


ఇకపోతే హీరో సూర్య, సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలు పోషించిన బందోబస్తు చిత్రంలో కూడా ఈ మిడతల దండు పై ఒక ఒక సన్నివేశం ఉంది. అందులో ఒక మైనింగ్ పరిశ్రమను నెలకొల్పేందుకు పంట పొలాలను నాశనం చేసేందుకు మిడతలను ఎలా ఉపయోగిస్తారు అన్న విషయంపై ఆ సినిమాలో చాలా స్పష్టంగా చూపించారు. అందులో కూడా ప్రస్తుతం ఉన్న మిడతల దండు లాగే పంట పొలాల్లోని పంటను పూర్తిగా నాశనం చేస్తాయి. అయితే అది సినిమా కాబట్టి హీరో ఆ పరిస్థితిని కాస్త తెలివిగా అడ్డుకుంటాడు. ప్రస్తుతం అయితే నిపుణులు చెప్పిన విధంగా రైతులు చేస్తే అందునుంచి కాస్త వరకు బయటపడవచ్చు. 

 

నిజానికి ఏమైనా కానీ ఇలాంటి విపత్కర పరిస్థితులను ముందే ఊహించి తమిళ దర్శకులు వాటిని తెరకెక్కించడం వారి ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది. ఇక కొందరైతే భవిష్యవాణి పుస్తకం ఏమైనా వారికి దొరికిందా అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా హాలీవుడ్ చిత్రం కంటేజియన్ సినిమా కూడా ఇదివరకే కరోనా వైరస్ మీద సినిమా తీసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: