మెగాస్టార్ చిరంజీవి... తెలుగు చిత్ర పరిశ్రమకు నిలువుటద్దం... ఎంతో మంది యువ హీరోలకు ఆదర్శం.. టాలెంట్ ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించిన మహోన్నత వ్యక్తి... దృఢ సంకల్పంతో ముందుకు సాగితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలము  అని రుజువు చేసిన కృషి వలుడు... ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయని మహోన్నత వ్యక్తి... ఇలా చెప్పుకుంటూ పోతే మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక సాదా సీదా కుటుంబంలో పుట్టి చిత్ర పరిశ్రమలో రాణించాలి అనే ఉద్దేశంతో... ఎన్నో అష్టకష్టాలు పడి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా... తన టాలెంట్ మీద ఉన్న నమ్మకంతో చిత్ర పరిశ్రమలో అవకాశాలను దక్కించుకున్నారు  మెగాస్టార్ చిరంజీవి. 

 


 అయితే అప్పటికే ఎంతో మంది హీరోలు... వారి వారసులు తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నప్పటికీ చిరంజీవి మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డాడు మెగాస్టార్ చిరంజీవి.. ఇక ఇలా వరుస అవకాశాలు చేజిక్కించుకుని తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాడు . తెలుగు ప్రేక్షకుల సుప్రీమ్ హీరోగా మారిపోయాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ.. తెలుగు ప్రేక్షకుల మెగాస్టార్ గా మారిపోయాడు. చిరంజీవి సినీ కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు... అన్నింటినీ దాటుకుంటూ తెలుగు ప్రేక్షకుల మెగాస్టార్ స్థాయికి ఎదిగారు చిరంజీవి. 

 


 తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో ప్రభావితం చేసిన వ్యక్తుల్లో  చిరంజీవి ఒకరు అని చెప్పారు. చిరంజీవి ఒక సాదాసీదా వ్యక్తి అనే కంటే ఒక యుగ పురుషుడు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే సాదాసీదా వ్యక్తి గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై...ఏ  హీరోకి లేనంతగా క్రేజ్ సంపాదించి... ప్రేక్షకుల మెగాస్టార్ గా మారిపోవడం చిరంజీవి కే సాధ్యమైంది అని చెప్పారు. అందుకే చిరంజీవి అంటే యువ  హీరోలందరికీ ఎంతో ఆదర్శంగా నిలుస్తుంటారు . సొంత టాలెంట్ తో ఎదగడమే కాదు... డాన్సుల, నటన విషయంలోనే కాదు... ఒక మంచి మనిషిగా.. సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తిగా కూడా ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: