తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు తమ దైన దర్శకత్వ నైపుణ్యంతో ఎంతగానో ప్రభావితం చేసి విజయవంతమైన దర్శకులుగా  కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ లోకి  ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఎక్కడా ఓటమి చవిచూడని దర్శకులు కూడా చాలామంది ఉన్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో. ఇలా ఓటమెరుగని దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ సక్సెస్ఫుల్  దర్శకుడిగా దూసుకుపోతున్నారు కొరటాల శివ. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కొరటాల శివ... ఇప్పుడు వరకు తీసిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. 

 

 అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు ప్రతి సినిమాకు సరికొత్త స్టొరీ తో... కొత్త కాన్సెప్ట్ తో దూసుకు పోతుంటే... కొరటాల శివ మాత్రం ఎంత కొత్త కాన్సెప్ట్ ఆయన అది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అయితేనే చేస్తూ ఉంటారు. లేకపోతే ఆ సినిమా జోలికి అస్సలు వెళ్లరు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకు కొరటాల శివ కేరాఫ్ అడ్రస్ అని అంటుంటారు ప్రేక్షకులు. ఇలా ఎన్నో మెసేజ్ ఓరియంటెడ్ చిత్రలను తెరకెక్కించి  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో ప్రభావితం చేశారు కొరటాల శివ. ఇక కొరటాల శివ సినిమాలో ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ తో కలిసి హాయిగా సినిమా చూసేలా  ఉంటాయి సినిమాలు.అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు దర్శకుడు కొరటాల శివ. 

 


 ఇక తన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించారు. తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో ప్రభావితం చేశారు కొరటాల శివ. ముఖ్యంగా కొరటాల శివ తెరకెక్కించే సినిమాలన్నీ సమాజాన్ని బాగు చేసే విధంగా ఉంటాయి. ఇక కొరటాల శివ సినిమాలు చూసి ప్రభావితమైన ఎంతో మంది ప్రేక్షకులు సినిమాల్లో లాగా కూడా మంచి చేయడానికి ముందుకు వచ్చిన ఘటనలు  కూడా ఉన్నాయి. ఇలా తనదైన దర్శకత్వంతో తెలుగు సినీ పరిశ్రమలో ఓటమెరుగని దర్శకుడిగా టాలీవుడ్ ను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ.

మరింత సమాచారం తెలుసుకోండి: