నాటితరంలో  ఎంతగానో గుర్తింపు సంపాదించి నేటి తరం దర్శకులకు ఆదర్శంగా నిలిచిన దర్శకులు  చాలా మందే ఉన్నారు. ఇలా నేటి తరానికి ఆదర్శంగా నిలిచిన దర్శకులలో  మొదటి వరుసలో ఉంటారు కె.రాఘవేంద్రరావు. తెలుగు చిత్ర పరిశ్రమలో కె.రాఘవేంద్రరావు ప్రస్థానం అద్భుతంగా సాగిన విషయం తెలిసిందే. ఎంతో మంది స్టార్ హీరోలు సైతం తమతో కె.రాఘవేంద్రరావు ఒక సినిమా తీస్తే బాగుండు అని ఎంతో ఆశగా ఎదురుచూసే వాళ్లు . ఇక ఎంతో మంది సినీ ప్రముఖులు తమ వారసులను కె.రాఘవేంద్రరావు సినిమాల ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తే ఎంతో గొప్ప నటులుగా ఎదుగుతారు అన్న నమ్మకం ఉండేది . అందుకే ప్రస్తుతం ఉన్న చాలామంది స్టార్ హీరోలు కే  రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన వాళ్లే కావడంతో ఉన్నారు. 

 


 కె.రాఘవేంద్రరావు ఏకంగా తన సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకేంద్రుడు గా మారిపోయారు. కె.రాఘవేంద్రరావు లోని దర్శకత్వ నైపుణ్యత ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉండేది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికీ సాధ్యం కానంత  క్రేజ్ సంపాదించిన కె.రాఘవేంద్రరావు... దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఎంతగానో ప్రభావితం చేశారు అని చెప్పాలి. పెద్ద హీరోల కెరీర్ లకు తన  సినిమాలతో పూలబాట పరచారు  రాఘవేంద్రరావు. ఎంతో మంది ప్రస్తుతం హీరోలు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళలో  అప్పట్లో రాఘవేంద్రరావు సినిమాల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 

 


 ఇక కె.రాఘవేంద్రరావు సినిమా తెరకెక్కుతుంది అంటే అందులో ఏదో మ్యాజిక్ ఉంటుంది . సినిమా చూస్తున్న ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ముఖ్యంగా యూత్ ని బాగా ఆకర్షిస్తుంటాయి  కె.రాఘవేంద్రరావు సినిమాలు. ఇక కె.రాఘవేంద్రరావు సినిమాల్లో  ఎక్కువగా హీరోయిన్ బొడ్డుపై పండ్లు వేయడం లాంటి సీన్స్ ఎక్కువగా పాపులర్ అయిపోయాయి. ఏ దర్శకుడు రాని  సరికొత్త ఆలోచన చేసిన కె.రాఘవేంద్రరావు... ఎంతో దర్శకత్వ నైపుణ్యంతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను  ఎన్నో ఏళ్ల పాటు ప్రభావితం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: