మెగా ఫ్యామిలీ మీదకు ఏదైనా వస్తే నాగబాబు చాలా వేగంగా స్పందించి సమాధానం చెప్తూ ఉంటారు. తన తమ్ముడ్ని అన్నా తన అన్నయ్యను అన్నా గాని విమర్శలు చేస్తూ ఉంటారు. ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలి అనేది పక్కన పెడితే ఎవరికి చెప్పాలో వారికి మాత్రం సూటిగా ఆయన చెప్తూ ఉంటారు. అది పక్కన పెడితే ఇప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద దుమారం రేపుతున్న సమయంలో నాగ బాబు వాటిపై స్పంద్సితూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. బాలకృష్ణ కు నేరుగా ఆయన వార్నింగ్ ఇచ్చేసారు. 

 

దీనిపై ఇప్పుడు బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు. అసలు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు అని... మీ మాటలు కేవలం మీ అభిప్రాయాలే గాని పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని... అలాంటిది మీ మాటలను ఎవరూ పట్టించుకునే అవకాశం లేదు అని కాబట్టి మీరు ఎంత ఆవేశ పడినా సరే మీకు కూడా ఉపయోగం ఉండదు అంటూ ఆయనను ఉద్దేశించి సూచనలు చేస్తున్నారు. మీరు ఆవేశంగా మాట్లాడితే తర్వాత మీరే ఇబ్బంది పడతారు అని నాగ బాబుకి సూచిస్తున్నారు. మరి కొందరు అయితే అసలు నాగ బాబు ఎవరో కూడా బాలయ్యకు తెలియదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

బాలకృష్ణ ఎవరిని అన్నారో అర్ధం కానప్పుడు ఎందుకు అంత ఆవేశం నాగ బాబు కి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ ను తక్కువగా మాట్లాడితే ఊరుకునేది లేదని, ఏదైనా ఉంటే చిరంజీవి  మాట్లాడతారు గాని మీకు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే బాలయ్య వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి అనేది వాస్తవం. మరి ఈ పంచాయితి ఎప్పుడు పూర్తి అవుతుంది ఈ గొడవ ఎప్పుడు అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: