టాలీవుడ్ లో బాలయ్య వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపడమే కాదు అనేక చర్చలకు కూడా వేదికగా మారాయి. ప్రశాంతంగా ఉన్న సినీ పరిశ్రమలో ఈ కొత్త చిచ్చు ఇప్పుడు పెద్దగా దుమారమే రేపుతూ వస్తుంది. బాలకృష్ణ ఏ ఆలోచన తో ఆ వ్యాఖ్యలు చేసారో గాని చాలా మంది మాత్రం ఆ వ్యాఖ్యల వెనుక కచ్చితంగా ఏదో అర్ధం ఉండే ఉంటుంది అని మాట్లాడుతున్నారు. దేశ వ్యాప్తంగా నందమూరి మెగా కుటుంబాలకు మంచి పేరు ఉంది. వాళ్ళు ఇద్దరూ ఎప్పుడు కూడా తగువులు పడిన సందర్భం గాని మరొకటి గాని లేదు అనే చెప్పాలి. 

 

అలాంటిది ఇప్పుడు ఆ ఇద్దరూ నేరుగా విమర్శలు చేసుకున్నారు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. చిరంజీవి ని ఉద్దేశి బాలయ్య అన్నారు అని భావించిన చిరంజీవి తమ్ముడు నాగ బాబు ఆవేశంగా ఒక వీడియో చేసారు. దీనితో ఇప్పుడు ఈ రెండు ఫ్యామిలీ ల మధ్య సయోధ్య కుదర్చడానికి గానూ ఒక మాజీ సిఎం రంగంలోకి దిగారు అని అంటున్నారు. ఆయనకు టాలీవుడ్ తో మంచి సంబంధాలు ఉన్నాయని బాలకృష్ణ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి అని కాబట్టి ఈ వివాదం పెద్దది కాకుండా జాగ్రత్తలు పడుతున్నారు అని సమాచారం. 

 

బాలకృష్ణ కు సదరు మాజీ సిఎం మంచి స్నేహితుడు అందుకే ఇప్పుడు ఆయనను కొందరు రంగం లోకి దించి ప్రయత్నాలు చేస్తున్నారు అని కాని ఇది పైకి కనపడని పెద్ద యుద్దమే అని కొందరు వ్యాఖ్యానించడం గమనార్హం. మరి ఇది ఎప్పుడు చల్లారుతుందో ఆ మాజీ సిఎం గారు ఏది చేస్తారో చూడాలి. ఇక మంత్రి తలసాని తో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. మరి ఎప్పుడు దీనికి ఎండ్ కార్డ్ పడుతుంది అనేది చూడాలి. బాలయ్య తో ఎవరు మాట్లాడతారో..

మరింత సమాచారం తెలుసుకోండి: