ఇటీవల ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ సందర్శించిన బాలయ్యబాబు తండ్రికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై ఇతర అంశాలపై తీవ్ర స్థాయిలో విమర్శనాత్మకంగా సంచలన వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు చిరంజీవి ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం పట్ల బాలయ్య బాబు స్పందిస్తూ ఆ భేటీకి ఇండస్ట్రీ నుండి తనకి పిలుపు రాలేదని చెప్పుకొచ్చారు. వాటికి సంబంధించిన వార్తలు పేపర్లలో మరియు టీవీ లలో చూస్తే గాని ఆ భేటీ గురించి తెలియలేదని అన్నారు.

 

ఇదే సమయంలో కొంచెం ఘాటుగా మాట్లాడుతూ సినిమా పరిశ్రమల చర్చల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారేమో మంత్రి తలసాని తో,  భూముల పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నారు ఏమో అని సెటైరికాల్ గా విమర్శలు చేశారు. అయితే బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు మరికొంతమంది ఇండస్ట్రీకి చెందిన వాళ్లు తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. ఎవరు కూడా ఈ విషయంలో బాలయ్య బాబు కి మద్దతుగా ఇండస్ట్రీలో మాట్లాడిన సందర్భాలు లేవు. పైగా బాలయ్య బాబు కు అత్యంత సన్నిహితంగా ఉండే నిర్మాత సి.కళ్యాణ్ కూడా బాలయ్య కి సపోర్ట్ గా మాట్లాడిన దాఖలాలు లేవు.

 

ఇటువంటి సమయంలో బాలయ్య బాబు కి సపోర్ట్ గా  ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తో జరిగిన సమీక్షకు బాలకృష్ణను పిలవకపోవడం తప్పే అన్నారు. సీనియర్ హీరోగా, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ప్రొడ్యూసర్ మెంబర్ అని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో కూడా ప్రొడ్యూసర్ మెంబర్ అని అల్లంటి వ్యక్తిని కనీసం సమావేశానికి పిలవకపోవడం దారుణమని అన్నారు. దీంతో ఒక్కరు బాలయ్యకి సపోర్టుగా రావటంతో సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు హమ్మయ్య ఒకరైన సపోర్ట్ గా వచ్చారు అని ఊపిరి పీల్చుకున్నారు. మరోపక్క గా బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని అభిమానులు సమర్ధిస్తున్నారు. కరోనా విరాళాలు సేకరించే సమయంలో సినీకార్మికులకు ఏర్పాటు చేసిన ట్రస్ట్ కి ఇండస్ట్రీ నుండి ఫస్ట్ బాలయ్య చెక్ రూపంలో డబ్బులు ఇచ్చి స్పందించారు. అలాంటపుడు  ఈ భేటీ కి ఆయనను పిలవకపోతే మరి ఎవరికైనా కోపం రాదా అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: