టాలీవుడ్ లో ఎంతో మంది కన్నడ బ్యూటీలు పరిచయం అయ్యారు. అందులో అతి కొద్ది మంది మాత్రమే మంచి సక్సెస్ అందుకున్నారు.  ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన రష్మిక మందన వరుస విజయాలో టాప్ హీరోయిన్ లీస్ట్ లోకి వెళ్లింది.  ఇక సంజన గల్రానీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. అప్పట్లో తరుణ్ ‘సోగ్గాడు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ప్రబాస్ హీరోగా నటించిన  ‘బుజ్జిగాడు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో వరుసపెట్టి సినిమాలు చేస్తోన్న సంజన.. తెలుగులో మాత్రం కనిపించింది చాలా తక్కువే. కిందటేడాది ‘దండుపాళ్యం 3’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.  ఈ అమ్మడు రీల్ లైఫ్ లో కన్నా రియల్ లైఫ్ లో ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొంటుంది. కన్నడ మహిళా నిర్మాత వందన జైన్‌ను సంజన బీర్ బాటిల్‌తో కొట్టిందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.

 

డిసెంబర్ 24న బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన పార్టీలో సంజన తనను బీర్ బాటిల్‌తో కొట్టి గాయపరిచిందని పోలీసులకు వందన ఫిర్యాదు చేసింది.. ఈ న్యూస్ అప్పట్లో సెన్సషన్ సృష్టించింది. ఆ తర్వాత సంజన ఈ వార్తలపై సంజన తాజాగా స్పందించింది. తనపై వందన చేస్తోన్న ఆరోపణలన్నీ తప్పని.. ఆమె చిల్లర ప్రచారం చేసుకుంటోందని మండిపడింది.  క‌న్నడ హాట్ బ్యూటీ సంజ‌న ఇటీవల కాలంలో తన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తోంది.

 

అయితే సంజ‌న‌ చాలా రోజులుగా ఒక యువకుడితో ప్రేమలో ఉన్నట్లు వార్త‌లు రాగా, ఫ్యామిలీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని పుకార్లు షికారు చేశాయి. ఈ నేప‌థ్యంలో సంజన కాస్త సీరియస్ అయ్యింది. అందులో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. తాను లవ్ లో ఉన్నానని..  ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానో లేదో తనకు తెలియదని, అలాగే జీవితంలో ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో ఎవరికీ తెలియదంటూ బ్యూటీ బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది సంజ‌న‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: