మన తెలుగులో ఇప్పుడు సినిమాలకు మంచి ఆదరణ అనేది ఉంది. సినిమాలు వస్తాయి అంటే చాలు జనాలు పనులు మానుకుని మరీ ఎదురు చూసే వాతావరణం మన తెలుగులో ఉంటుంది అనేది వాస్తవం. ఒక్క సినిమా విడుదల అవుతున్నా చాలు పనులు మానుకుని మరీ చూస్తూ ఉంటారు. దాదాపు అన్ని సినిమాలకు ఇదే స్థాయిలో క్రేజ్ ఉంటుంది అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సినిమాలు వస్తున్నాయి అంటే చాలు ప్లాన్ చేసుకుని మరీ వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి దాదాపుగా ఉండే అవకాశం ఉండదు.

 

అవును ఇప్పుడు సినిమాలు చూడాలి అంటే చాలు జనాలు భయపడుతున్నారు. అవును ఇప్పుడు చాలా వరకు సినిమాలకు వెళ్ళే పరిస్థితి లేదు అని అంటున్నారు. సినిమాలు విడుదల అయినా సరే ఎవరూ కూడా హాల్ కి వెళ్ళే అవకాశం ఉండదు అనేది చాలా మంది మాట. అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకోవద్దు అనే భావన లో జనాలు ఉన్నారని అందుకే సినిమా హాల్ కి వెళ్ళడానికి ఆసక్తి చూపించడం లేదు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అందుకే ఇప్పుడు సినిమా టికెట్ ధరలను పెంచే అవకాశం ఉందని కూడా సమాచారం. 

 

దాదాపుగా మన తెలుగులో టికెట్ ధరలను పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలా మంది అంటున్నారు సినిమాలు చాలా వరకు నష్టాల్లోనే ఉన్నాయి అని అందుకే ఇప్పుడు నష్టాల నుంచి బయటకు రావడానికి చాలా వరకు ధరలను పెంచే అవకాశం ఉందనే కథనాలు ఎక్కువగా వస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాల నష్టాలను భరించాలి అంటే మాత్రం ఇప్పుడు టికెట్ ధరలను పెంచడం ఖాయం అనే అభిప్రాయం చాలా వరకు వ్యక్తమవుతూనే ఉంది. మరి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలని అంటున్నారు. చూడాలి ఏ నిర్ణయం తీసుకుంటారో...

మరింత సమాచారం తెలుసుకోండి: