బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ నుంచి విడాకులు కావాలంటూ అతడి భార్య ఆలియా కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు నవాజ్‌కు లీగల్ నోటీసు పంపించామని,  మెయింటెనెన్స్‌ కూడా ఇవ్వాల్సిందిగా అందులో కోరామని ఆలియా న్యాయవాది తెలిపారు.  కోవిడ్‌-19 కారణంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇ-మెయిల్‌, వాట్సాప్‌ల ద్వారా నోటీసులు పంపినట్లు అలియా తరఫు లాయర్‌ అభయ్‌ తెలిపారు. 2009లో అలియాని రెండో వివాహం చేసుకోగా వారికి ఇద్ద‌రు సంతానం ఉన్నారు.  విడాకులు కోరడానికి సంబంధించిన కారణాలను  తెలుపుతూ.. తామిద్దరి మధ్య అనేక సమస్యలున్నాయని, వాటిని బహిర్గతం చేయడం ప్రస్తుతం తనకిష్టం లేదని చెప్తూనే, పెళ్లైన ఏడాది నుంచే తమ మధ్య బేధాభిప్రాయాలు మొదలయ్యాయని, లాక్‌డౌన్ కొనసాగిన రెండు నెలల కాలంలో తనను తాను ఆత్మపరీక్ష చేసుకున్నానని, ఆ తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

 

తన పేరును కూడా మునుపటిలా మార్చుకుంటున్నట్లు తెలిపారు. ‘నా అసలు పేరు అంజలి కిశోర్ పాండే. నేను ఇకమీదట ఆ పేరుతోనే కొనసాగుతాను. మరొకరి గుర్తింపుతో బతుకుతూ లాభం పొందాల్సిన అవసరం నాకు లేదంటూ' ఆమె తెలిపారు. తాజాగా  నవాజుద్దీన్‌ను ఆలియా విడాకులు, భరణం కింద రూ.30 కోట్లు డిమాండ్‌ చేయడంతోపాటు 4 బీహెచ్‌కే ఫ్లాట్‌ ఇవ్వాలని అడిగినట్లు ఆన్‌లైన్‌లో పుకార్లు పుట్టుకొచ్చాయి.

 

తన ఇద్దరు పిల్లల కోసం రూ.20 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని మరో నోట్‌ సారాంశం. అయితే ఈ పుకార్లను ఆలియా కొట్టిపారేసింది.  ఇలాంటి పుకార్లను ఎవరూ పట్టించుకోవద్దని కోరింది.  నా లాయర్లకు మీడియా సంస్థల నుంచి కాల్స్‌ వస్తున్నాయి. నా నోటీసుల కాపీ ఉందని ఎవరు చెప్పారు. అదంతా ఎవరో కావాలని సృష్టించిన కల్పిత కాపీ. ఎవరో ప్రాక్టీస్‌ కోసం కోసం ఇలా చేసి ఉండొచ్చని చెప్పింది. దయచేసి ఈ పుకార్లు నమ్మోదని అంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: