టాలీవుడ్ లో రాఘవేంద్ర రావు చిరంజీవి కాంబినేషన్ లో సినిమా అనగానే జనాలకు ఒక రేంజ్ లో ఆసక్తి ఉంటుంది. సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే ప్రేక్షకులు కూడా  ఉన్నారు. చిరంజీవి కెరీర్ లో ఎన్నో సినిమాలను చేసారు రాఘవేంద్ర రావు. దాదాపు ఇద్దరి కాంబినేషన్ లో కలిపి మొత్తం 15 సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. 12 సినిమాల్లో చిరంజీవి హీరో గా ఉన్నారు. ఇక చిరంజీవి కెరీర్ లో రికార్డ్ లు నమోదు చేసిన సినిమాలు అన్నీ కూడా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన సినిమాలే అనేది వాస్తవం. 

 

రాఘవేంద్ర రావు ఇప్పుడు మళ్ళీ చిరంజీవి తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి ఇప్పుడు ఆయన తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి ఎంతో ఎదురు చూస్తున్నారట. ఈ సినిమా కథను ఆయన 2000 లోనే చెయ్యాల్సి ఉందని కాని అప్పుడు చిరంజీవి బిజీ గా ఉండటం తో ఆయన సినిమా చేయలేదు అని సమాచారం. 

 

సినిమా  కథ ఇప్పటికే దాదాపుగా సిద్దంగా ఉందని వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో వస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో ఉంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: