మన తెలుగులో కొరటాల శివ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అతి తక్కువ కాలంలో స్టార్ దర్శకుడి గా మారిపోయారు. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేయడమే కాదు ఆ సినిమాలు మంచి హిట్ కావడం తో ఆయనకు కమర్షియల్ దర్శకుడి గా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆయన మంచి సినిమాలు చేస్తూ తనకు వచ్చిన స్టార్ ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు చిరంజీవి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వచ్చే అవకాశం ఉంది. 

 

సినిమా టైటిల్ ని ఆచార్య అని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ ఏంటీ అనేది త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత కొరటాలసినిమా చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా తర్వాతః ఆయన మహేష్ తో సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కాని మళ్ళీ ప్రభాస్ తో ఒక సినిమా చేస్తారు అని అన్నారు. కాని ప్రభాస్ ఇప్పుడు చాలా బిజీ గా ఉన్నారు. ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు. రాబోయే మూడేళ్ళ వరకు అతను సినిమాలతో బిజీ గా ఉన్నారు. 

 

ఇక రామ్ చరణ్ తో చేసే అవకాశం ఉందని అన్నారు. రామ్ చరణ్ ఇప్పుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా  తర్వాత రామ్ చరణ్ బిజీ అయ్యే అవకాశం ఉంది. దీనితో ఇప్పుడు కొరటాల ఎవరి తో సినిమా చేస్తారు అనేది స్పష్టత రావడం లేదు. చిరంజీవి సినిమా పూర్తి అయిన తర్వాత గ్యాప్ తీసుకునే అవకాశం ఉందని సినిమాలకు కొన్ని రోజులు దూరంగా ఉంటారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: