ఇప్పుడు చిన్న చిన్న దర్శకులు కూడా టాలీవుడ్ లో పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేయడానికి గానూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక స్టార్ హీరోలు కూడా ఇప్పుడు వారికి అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు అందులో ప్రధానంగా చిరంజీవి రామ్ చరణ్ ఎక్కువగా యువ హీరోలకు అవకాశాలు ఇచ్చే విషయంలో చాలా ముందు ఉన్నారు. వారికీ టాలెంట్ ఉందని వాళ్ళు నమ్మితే చాలు ఇప్పుడు అవకాశం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. 

 

ప్రస్తుతం రామ్ చరణ్ అయితే యువ దర్శకులతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అని అంటున్నారు. ఇక చిరంజీవి అయితే ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో సీనియర్ దర్శకుల కంటే యువ దర్శకులతోనే సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారని అంటున్నారు. దానికి కారణం ఏంటీ అనేది చూస్తే నేటి ట్రెండ్ ని అర్ధం చేసుకుని వాళ్ళే సినిమాలు చేస్తున్నారు అని యువ దర్శకుల్లో ఆ సత్తా ఉందని సీనియర్ దర్శకుల్లో ఆ సత్తా లేదని అంటున్నారు. అందుకే సీనియర్ దర్శకులను ఆయన పక్కన పెడుతున్నారు అని అంటున్నారు. 

 

ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ రెండు సినిమాలు కూడా యువ దర్శకులతో చేసే సినిమాలే కావడం విశేషం. లూసిఫర్ విషయంలో సీనియర్ దర్శకుడ్ని తీసుకునే ఆలోచన రామ్ చరణ్ చేసినా సరే చిరంజీవి యువ దర్శకుడిని కథ రెడీ చేయమని ఇచ్చారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి అది ఎంత వరకు నిజం అనేది చూడాలి. ప్రస్తుతం ఆయన అవకాశం ఇచ్చింది కూడా సీనియర్ దర్శకుడికి ఏమీ కాదు. ఇక రామ్ చరణ్ కూడా భవిష్యత్తు లో చేసే సినిమాల విషయంలో ఇవే జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటున్నారు అని భావిస్తున్నారు. మరి ఎవరికి అవకాశం ఇస్తారో...

మరింత సమాచారం తెలుసుకోండి: