టాలీవుడ్ లో ఇప్పుడు బాలకృష్ణ సినిమాలకు క్రేజ్ తగ్గిన సంగతి తెలిసిందే. ఆయన సినిమాలను పెద్దగా అభిమానులు మినహా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలు బాగా ఇబ్బంది పెట్టాయి. ఆయన చేసే సినిమాలకు నష్టాలు రావడం తో ఆయన చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు. ముందు ఎవరికి పడితే వారికి అవకాశం ఇచ్చిన ఆయన ఇప్పుడు  జాగ్రత్త పడుతూ అగ్ర ధర్శకులకే అవకాశాలు ఇవ్వాలి అని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలకు ఓకే చెప్పారు. 

 

అందులో ఒకటి బోయపాటి తో చేస్తున్నారు. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడం కూడా జరిగింది. దాదాపు సినిమా  పూర్తి అయింది షూటింగ్. ఇక ఆ సినిమా తర్వాత ఆయన ఒక సినిమాను యువ దర్శకుడి తో చేస్తారు. ఆయన పూరి అని కొందరు అని అంటున్నారు. పూరి తో సినిమాకు సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయి అని ఆ కథను బాలయ్య పైసా వసూల్ సమయంలోనే విన్నారు అని కథ అంతా ఓకే అని కొన్ని మార్పులు ఉండటం తో సినిమాలో మారుస్తున్నారు  అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయన బీ గోపాల్ తో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాకు సంబంధించిన కథ బాలకృష్ణ విన్నారు అని సమాచారం. గతంలో వీరు సినిమాలను చేసారు. ఆరు సినిమాలు చేయగా అందులో ఎక్కువగా విజయం సాధించిన సినిమాలే ఉన్నాయి. ఆ సినిమాల తర్వాత వాళ్ళు మళ్ళీ సినిమా చేయలేదు. ఇక బాలకృష్ణ ఇప్పుడు మళ్ళీ ఆయన తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు ఆయనకు మంచి హిట్ కావాలని అందుకే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: