తెలుగు సినిమాల్లో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా దూసుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఇలాంటి స్టార్ స్టేటస్ వచ్చిన హీరోయిన్ కు లాంగ్ లైఫ్ ఉంటుంది. త్రిష, శ్రియ, అనుష్క, నయనతార, తమన్నా, కాజల్.. వంటి స్టార్ హీరోయిన్లు కూడా లాంగ్ కెరీర్ అనుభవిస్తున్నవారే. ప్రస్తుతం రకుల్ హవా తెలుగులో తగ్గింది. కానీ.. ఒక్క అవకాశం దక్కి హిట్ వస్తే రకుల్ టైమ్ స్టార్ట్ అవటం ఖాయం. ప్రస్తుతం హిందీ, తమిళ్ లో సినిమాలు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవడంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.

IHG

సినిమాలు ధియేటర్లో రిలీజ్ చేసుకోవాలా, ఓటీటీల్లో రిలీజ్ చేసుకోవాలా అనేది నిర్మాత ఇష్టం అంటోంది. వారు కష్టపడి తెరకెక్కించిన సినిమా ఎలా బయటకు వెళ్తే సేఫ్ అవుతారో వాళ్లకే తెలుస్తుంది. నేనే నటించిన సినిమాలే అయినా అది పూర్తిగా నిర్మాత ఇష్టమే అంటోంది. కానీ.. సినిమా అనేది పెద్ద స్క్రీన్ లో చూడటమే బాగుంటుంది అంటోంది కూడా. గతంలా ఇకపై షూటింగ్ స్పాట్ లో ఎక్కువ మంది ఉండటానికి కుదిరే అవకాశాలు కనపడటం లేవంటోంది రకుల్ బేబీ. సెట్లో కూడా ఖర్చులు కూడా బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్తోంది.

IHG

ప్రస్తుతం రకుల్ హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. అందులో అటాక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అర్జున్ కపూర్ తో చేస్తున్న సినిమా పూర్తయ్యే దశలో ఉంది. తమిళ్ లో చేస్తున్న భారతీయుడుతో పాటు మరో సినిమా చేస్తోంది. తెలుగులో నితిన్ తర్వాతి సినిమాలో రకుల్ చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. వరుస ఫ్లాపులతో కొంత వెనుకబడింది. నితిన్ సినిమా క్లిక్ అయితే తెలుగులో మళ్లీ తన దశ తిరగడం ఖాయమే.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: