కొన్ని కొన్ని విషయాల గురించి జరిగే అనవసర చర్చల  గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏదో వార్త రాగానే దాని గురించి ఏదో ఊహించుకుని మీడియా ఏదొకటి రాయడం దానిని నమ్మి ఏదో కథనాలు తర్వాత సోషల్ మీడియా వేదికగా రావడం వంటివి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. లేని దానికి ఏదో రాసి ఉంది అని సృష్టించే కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అర్ధమవుతూ ఉంటుంది.  ఇటీవల సమంతా పిల్లల మీద దృష్టి పెట్టింది అని ఒక వెబ్ సైట్ కథనం రాసింది. దీని మీద వార్త వచ్చిందో లేదో కొన్ని మీడియా సంస్థలు వెళ్లి ఆమెను అడిగే ప్రయత్నం చేసాయి.

 

తాజాగా ఒక యుట్యూబ్ ఛానల్ కి చెందిన వ్యక్తి ఆమెను దీనికి సంబంధించి ఒక ప్రశ్న వేసినట్టు సమాచారం. దీనితో ఆమెకు ఒళ్ళు మండిపోయింది అని సమాచారం. దీనితో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ రేటింగ్ కోసం మీ వ్యూస్ కోసం మా మీద తప్పుడు వార్తలు రాస్తారా ? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అనవసరం గా మీరు ప్రచారం చేయడం తమ జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది అని... నేను పిల్లలను కంటే ఏంటీ కనకపోతే ఏంటి ? కొన్ని విషయాల గురించి జరిగే అనవసర చర్చల  గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసింద‌ట‌.

 

ఇక ఇటీవ‌ల స‌మంత కొద్ది రోజుల పాటు సినిమాల‌కు దూరంగా ఉంటుంద‌ని... ఆమె ఇప్ప‌టికే ఒప్పుకున్న సినిమాల‌ను కూడా వ‌దులు కుంటోంద‌ని.. ఇక ఆమె సినిమా లైఫ్ కు దూరంగా పిల్ల‌ల‌ను క‌ని...ఎంచ‌క్కా ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తోంద‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఈ వార్త‌ల‌పై స్పందించిన ఆమె పై విధంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినట్టు స‌మాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: