లాక్ డౌన్ ను హాలిడేస్ గా తీసుకోవద్దు.. ఈ లాక్ డౌన్ ను ఓ ఆపర్చునిటీగా తీసుకోండని చాలా మంది చెబుతున్నారు. న్యూ స్కిల్స్ డెవలెప్ చేసుకోండని సలహాలు ఇస్తున్నారు. అయితే కామన్ పబ్లిక్ ఎంతమంది ఈ స్టేట్ మెంట్ ని సీరియస్ గా తీసుకుంటున్నారో తెలియడం లేదు. కానీ డేవిడ్ వార్నర్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఈ లాక్ డౌన్ స్టార్ గా మారిపోయాడు వార్నర్. 

 

లాక్ డౌన్ ను డేవిడ్ వార్నర్ వాడుకుంటున్నట్టుగా ఎవరూ వాడుకోవడం లేదు. ప్రపంచమంతా ఈ కరోనా ఏంటి.. లాక్ డౌన్ ను ఎప్పుడు ఎత్తేస్తారని ఎదురు చూస్తోంటే వార్నర్ మాత్రం మరో ప్రపంచంలో ఉన్నట్టు ఎంజాయ్ చేస్తున్నాడు. టిక్ టాక్ లో మునిగిపోతున్నాడు. తెలుగు పాటలకు డ్యాన్సులు చేస్తూ ఫుల్ పాపులర్ అవుతున్నాడు వార్నర్. 

 

డేవిడ్ వార్నర్ కు సన్ రైజర్స్ కెప్టెన్ గా తెలుగు నాట మంచి ఫాలోయింగ్ ఉంది. మ్యాచ్ విన్నర్ గా సూపర్ ఇమేజ్ ఉంది. అయితే ఇప్పుడు క్రికెటర్ గా వచ్చి పాపులారిటీ కంటే.. టిక్ టాక్ స్టార్ గా మరింత ఫేమస్ అయ్యాడు వార్నర్. పక్కా లోకల్ అంటూ మాస్ స్టెప్పులు, బుట్టబొమ్మ అంటూ క్లాస్ సాంగ్ కు డ్యాన్సులు వేస్తూ తెలుగు వారికి ఫుల్ గా కనెక్ట్ అయ్యాడు వార్నర్. 

 

బాలీవుడ్ వరకు భాషతో పనిలేకుండా ఇండియన్ సినిమా సాంగ్స్ అన్నింటికీ డ్యాన్సులు చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్నాడు. ఇక ఈ క్రికెటర్ హడావిడి చూసి స్టార్ హీరోల ఫ్యాన్స్ అందరూ ఇతన్ని ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. దీంతో ఇన్ స్టాగ్రామ్ లో వార్నర్ ఫాలోవర్స్ మూడు మిలియన్లు దాటిపోయారు. మొత్తానికి క్రికెటర్ వార్నర్ ఆటలోనే కాదు.. తనకు మరో టాలెంట్ ఉందని కూడా నిరూపించుకుంటున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: