లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లో ముగించుకొని రిలీజ్ అయిన సినిమాలు చాలా ఆగిపోయి ఉన్నాయి. థియేటర్లు క్లోజ్ అయిపోవడంతో సినిమా కంప్లీట్ అయిన గాని రిలీజ్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది నిర్మాతలు అనేక నష్టాలు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో సూర్య నిర్మించిన ‘పోన్ మగళ్ వంథాల్’ సినిమాలో జ్యోతిక నటించిన సినిమాని థియేటర్లో కాకుండా ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నట్లు లాక్ డౌన్ స్టార్టింగ్ లో సూర్య ప్రకటించారు. దీంతో తమిళ సినిమా ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్లు  థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఓటీటీకి ఈ సినిమాను ఎలా ఇస్తారంటూ గొడవకు దిగారు. అంతేకాకుండా ఒక వేళ అలా చేస్తే రాబోయే రోజుల్లో సూర్య సినిమాలు ఏవి కూడా థియేటర్లో రిలీజ్ అవకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=AUDIENCE' target='_blank' title='audience-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>audience</a> review: South actress Jyothika's ...

దీంతో డిస్ట్రిబ్యూటర్లు చేసిన వ్యాఖ్యలకు సూర్య గతంలో స్పందిస్తూ నేను అప్పులు పాలు అయిపోయాను దయచేసి సినిమా మొత్తం అయిపోయింది ‘పోన్ మగళ్ వంథాల్’ సినిమా కి అడ్డుపడకండి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాను ప్రకటించడం జరిగింది. అయినా గాని సినిమా థియేటర్ల యాజమాన్యాలు సూర్య పై ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయం నడుస్తూ ఉండగానే  సూర్య నిర్మించిన సినిమాని ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ చేసేసారు.

IHG satisfied me as a viewer and producer: Suriya ...

క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అవటంతో సినిమా కోసం ఎదురు చూసిన వాళ్లు సూర్య అభిమానులు ఉదయం నుంచి సోషల్ మీడియాలో రివ్యూలు మీద రివ్యూలు రాస్తున్నారు. సినిమా అదిరిపోయింది అని జ్యోతిక పెర్ఫార్మెన్స్ ఓవరాల్ గా అదరగొట్టింది హైలెట్ అని అంటున్నారు. ఇదే సమయంలో ఓటీటీలో రాబోయే రోజుల్లో అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీ బాంబ్’ సినిమా, అమితాబ్ బచ్చన్ నటించిన గులాబోసితావో సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దీంతో సినిమా ప్రేక్షకులకు ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు చూసే అవకాశం ఇంటిలోనే కలుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: