తమిళ చిత్ర పరిశ్రమలో ఎప్పుడు లేని విధంగా ఒక సినిమా రిలీజ్ విషయంలో పెద్ద రచ్చ జరిగి సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకునేందుకు దారి తీసింది. కరోనా విజృంభణ కారణంగా గత రెండు నెలలుగా అన్ని చిత్ర పరిశ్రమలు అగాధం లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. అలాగే సినిమాలు రిలీజ్ కాక నిర్మాతలు కోట్లలో నష్టాలను నెత్తిమీద వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే సూర్య తప్పని పరిస్థితుల్లో తను నిర్మించిన సినిమాని ఓటీటీ లో రిలీజ్ చేయాలనుకున్నారు.

 

దాంతో తమిళ పరిశ్రమలో థియోటర్స్ సంఘాలు, డిస్ట్రిబ్యూటర్స్ వ్యతిరేకంగా మారారు. అయినా సూర్య వెనకడుగు వేయలేదు. తన భార్య జ్యోతిక నటించిన పొన్ మగల్ వందాల్ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు అమేజాన్ ప్రైం తో అగ్రిమెంట్ చేసుకున్నారు. అయినా కొంత కాలం ఈ సినిమా రిలీజ్ విషయంలో సంధిగ్దత నెలకొంది. అయితే సూర్య డ్రాపయ్యారు... సినిమాని థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కాని ఈ విషయంలో సూర్య జ్యోతిక తమిళ పరిశ్రమలో కొందరికి దిమ్మ తిరిగే షాకిచ్చారు. 

 

‘పొన్ మగల్ వందాల్’ అమేజాన్ ప్రైంలో రిలీజైంది. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించగా.. జ్యోతిక ప్రధాన పాత్ర పోషించింది. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవంగా ఇలాంటి సినిమాని థియోటర్స్ లో చూస్తే ఆ ఎగ్జైట్మెంటే వేరేగా ఉంటుంది. కాని సూర్య తనకున్న అప్పుల కారణంగా ఇంకా ఈ సినిమాని రిలీజ్ చేయకుండా ఉండలేమని తేల్చి చెప్పారు. 

 

అనుకున్నట్టుగానే అన్ని అడ్డంకులనూ దాటుకుని ‘పొన్ మగల్ వందాల్’ ఆన్ లైన్లో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పాజిటివ్ గా చెప్పుకుంటున్నారు. ‘పొన్ మగల్ వందాల్’ చాలా మంచి సినిమా అని మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా జ్యోతిక నటనకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారట. అందరి అంచానాలు తారుమారు చేశారు సూర్య జ్యోతిక. చెప్పాలంటే ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో ఈ బ్యూటిఫుల్ కపుల్ సంచలనంగా మారారు. ఇప్పుడు వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరికొన్ని ఫీల్ గుడ్ మూవీస్ ని ఓటీటీ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: