వరసగా ఫ్లాపులొచ్చి బాగా గ్యాప్ వచ్చినా రకుల్ ప్రీత్ సింగ్ కి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మన్మధుడు 2 ఫ్లాప్ తర్వాత రకుల్ కి తెలుగులో వకాశాలు కాస్త తగ్గిన మాట వాస్తవమే అయినప్పటికి ఆ గ్యాప్ ని ఫుల్ ఫిల్ చేయడానికి తెలుగు తమిళం హిందీ లలో కలిపి దాదాపు 6  సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ అన్ని మూతపడిన సంగతి తెలిసిందే. గత  రెండు నెలలుగా ఇదుగో అదుగో అంటూ నెట్టుకొస్తున్నారు. ఇప్పటికే థియోటర్స్ లో బొమ్మ ఎప్పుడు పడుతుందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు అనుమతులనివ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.

 

ఇప్పటికే రెండు సార్లు జరిగిన చర్చల తర్వాత జూన్ 15 నుండి షూటింగ్స్ మొదలవచ్చనే మాట వినిపిస్తోంది. అయితే థియోటర్స్ ఓపెన్ ఎప్పుడు అవుతాయో తెలియని నేపథ్యంలో కొన్ని సినిమాలని ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. అలాగే మరికొన్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళ సినిమా "పొన్ మగల్ వందాల్" రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే తెలుగులో నవదీప్ సినిమా కూడా రిలీజై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంటుంది. ఇక మహానటి కీర్తి సురేష్ నటించిన ద్విభాషా చిత్రం పెంగ్విన్ ని త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. 

 

ఇక తాజాగా రకుల్ ప్రీత్ ఇదే విషయంలో పాజిటివ్ గా స్పందించింది. ఒక సినిమా ఓటీటీలో రిలీజ్ చేయడమా లేక థియేటర్స్‌లో రిలీజ్ చేయడమా.. అనేది నిర్మాతల ఇష్టం అని...నిర్మాతల వైపు నుంచి మాట్లాడింది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు వేరు కరోనా తో నెలకొన్న తాజా పరిస్థితులు వేరు అని వీటిని బట్టే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ప్లాన్స్ ఉంటాయని తెలిపింది. ఇక రకుల్ నటించిన రెండు సినిమాలు షూటింగ్స్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

 

ఎటాక్ సినిమాతో పాటు అర్జున్ కపూర్ తో కలిసి నటించిన సినిమా కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. వీటితో పాటు భారతీయుడు 2 తో పాటు నితిన్ సినిమా అలాగే మరికొన్ని సినిమాలు నటించడానికి ఒకే చెప్పింది. మొత్తానికి నిర్మాతల వైపు నుండి ఆలోచించి మాట్లాడి రకుల్ అందరికి అందుబాటులో ఉంటా అన్న హింట్ కూడా ఇన్‌డైరెక్ట్ గా ఇచ్చింది. మరి ఇలా పాజిటివ్ గా మాట్లాడిన రకుల్ కి మరిన్ని ఛాన్సులొస్తాయోమో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: