సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ టైంలో క్లైమాక్స్, కరోనా వైరస్ సినిమాలతో షాక్ ఇచ్చాడు. మియా మాల్కోవాతో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సినిమాతో ఆమెను వదిలేశాడు అనుకోగా ఆమెతో క్లైమాక్స్ అంటూ ఓ సినిమా తీసి ట్రైలర్ వదిలాడు. అయితే ఈ సినిమా షూటింగ్ అప్పుడే చేసి ఉంటాడని అందరు అనుకుంటున్నారు. క్లైమాక్స్ సినిమాను జూన్ 6న రిలీజ్ ప్లాన్ చేశాడు. ఆర్జీవీ వరల్డ్ అంటూ కొత్త ఓటిటి ఏర్పాటు చేసి డైరెక్ట్ గా సినిమాను క్లైమాక్స్ మూవీని రిలీజ్ చేస్తున్నాడు. 

 

ఇక ఈ సినిమాను 100 రూపాయలు పెట్టి సినిమా చూడండని అంటున్నాడు ఆర్జీవీ. మాములుగా మిగతా ఓటిటి ఫ్లాట్ ఫామ్ లు నెల వారి ఛార్జ్ ఒకటి ఫిక్స్ చేసి దానికి లాగ్ ఇచ్చి అందులో ఉన్న సినిమాలను ఎప్పుడైనా చూసే అవకాశం ఇచ్చారు. కానీ ఆర్జీవీ వరల్డ్ లో మాత్రం పే పర్ వ్యూ ద్వారా రిలీజ్ చేస్తున్నాడు. అయితే సినిమా టికెట్ ధరను 100 రూపాయలు ఫిక్స్ చేశాడు ఆర్జీవీ. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాకపోయినా సరే ఒక్కసారి చూడటానికి 100 రూపాయలు అంటే ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. 

 

క్లైమాక్స్ తో పాటుగా కరోనా వైరస్ సినిమాను కూడా ఆర్జీవి వరల్డ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఇదే కాదు ఇక మీదట ఆర్జీవీ చేసే సినిమాలు కూడా ఆర్జీవీ వరల్డ్ ఓటిటిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా గురించి చెబుతూ మీరంతా బి ద రియల్ మెన్ ఛాలెంజ్ చేస్తే నేను సినిమా తీశా అంటూ షాక్ ఇచ్చాడు వర్మ. మరి ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.   


 

మరింత సమాచారం తెలుసుకోండి: