టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని భారతీయ చలన చిత్ర రంగం యొక్క దమ్ముని ప్రపంచ సినిమా రంగానికి చాటిచెప్పింది ‘బాహుబలి’. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ చలన చిత్ర రంగంలో అనేక రికార్డులు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా హిట్ అవడంతో ప్రపంచ స్థాయిలో బాహుబలి కి మంచి క్రేజ్ దక్కింది. ఒకానొక టైంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవలసి వస్తే బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకునేవారు. కానీ బాహుబలి వచ్చిన తర్వాత ప్రపంచ సినిమా ప్రేమికులు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే రాజమౌళి గురించి మాట్లాడుకునే పరిస్థితికి బాహుబలి తీసుకొచ్చింది.

IHG

ఇండియా దేశంలో మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకి మంచి ప్రశంసలు దక్కడంతో జపాన్ వంటి దేశాల్లో కూడా రిలీజ్ చేయడంతో బాహుబలి క్రేజ్ పతాక స్థాయికి చేరింది. జపాన్ దేశంలో సినిమా సూపర్ డూపర్ హిట్ అవటంతో రాజమౌళి మరియు ప్రభాస్ సూపర్ స్టార్ లుగా మారిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా బాహుబలి రేంజ్ లో మరొకసారి ప్రూవ్ అయింది. అదేమిటంటే ఇటీవల ఈ సినిమాని రష్యన్ టీవీ చానల్స్ వారి భాషలోనే ప్రసారం చేశారు.

IHG's birthday gift: First look of Baahubali 2

వాటికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో రిలీజ్ అవ్వటంతో వైరల్ గా మారాయి. ముఖ్యంగా సినిమాలో హైలెట్ సీన్ గా చిత్రీకరించిన దేవసేన మీద మహిష్మతి సభలో ప్రభాస్ తల నరికే సీన్ రష్యన్ భాషలో ఆ సన్నివేశంలో డైలాగులు విని ప్రభాస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విధంగా మరోసారి బాహుబలి తన సత్తా చాటింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: